వరుణ్ ధావన్ తో సమంత రొమాన్స్!

Sun Jan 16 2022 16:31:24 GMT+0530 (IST)

Samantha romance with Varun Dhawan!

సమంత తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి గ్యాప్ అనేది రానీయలేదు. తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. ఒకే సమయంలో ఈ రెండు భాషల్లోను హిట్ మూవీస్ చేస్తూ దూసుకెళ్లింది. అయితే వివాహమైన తరువాత మాత్రం ఆమె ఎక్కువగా నాయిక ప్రధానమైన సినిమాలను చేస్తూ వెళ్లింది. అలా ఆమె చేసిన 'యూ టర్న్' .. 'ఓ బేబీ' మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఈ ఏడాదిలో ఆమె 'శాకుంతలం' .. 'యశోద' సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.'శాకుంతలం' పాన్ ఇండియా సినిమా కాగా ఒక దృశ్యకావ్యంగా ప్రేక్షకులను పలకరించనుంది. ఇక 'యశోద' థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోంది. ఇక ఈ సినిమాల తరువాత సమంత మరింత దూకుడు పెంచుతోంది. తెలుగు .. తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాపై కూడా ఆమె దృష్టిపెడుతోంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇక ఇటీవల సమంత చేసిన 'ఫ్యామిలీ మేన్ 2' ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ వెబ్ సిరీస్ ఆమెకి విమర్శలతో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది.

'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్ చేసినవారే .. మరో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఒక కీలకమైన పాత్ర కోసం సమంతను అడుగుతున్నారట. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్ యాక్షన్ ప్రధానంగా నడుస్తుందట. ఇక హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న 'సిటాడెల్'ను ఇండియాలోను .. ఇటలీలోను రీజినల్ వెర్షన్స్ లో తీయబోతున్నారు. ఇండియా వెర్షన్ లో ప్రధానమైన పాత్ర కోసం సమంతను తీసుకున్నారట. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో సమంత రొమాన్స్ ను చేయనున్నట్టు చెబుతున్నారు.

సమంత ఇప్పుడు ఈ సిరీస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టిందట. రొమాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో .. దానిని బ్యాలెన్స్ చేస్తూ యాక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది. అందువలన ఈ సిరీస్ లోని ఆమె పాత్రకి ఫిట్ నెస్ చాలా అవసరం. ఈ కారణంగా సమంత గంటల తరబడి వర్కౌట్స్ చేస్తోందని చెబుతున్నారు. ఈ సిరీస్ కోసం అంతర్జాతీయంగా పేరున్న స్టంట్ కొరియోగ్రాఫర్లు రంగంలోకి దిగుతున్నారు. వాళ్ల దగ్గర సమంత ప్రత్యేక శిక్షణ తీసుకోనుందని అంటున్నారు. ఒక వైపున సినిమాలు .. మరో వైపున వెబ్ సిరీస్ లతో సమంత గ్రాఫ్ మిస్సైల్ లా దూసుకుపోతుండటం విశేషం.