Begin typing your search above and press return to search.

'అక్కినేని' పేరుని తొలగించిన సమంత..!

By:  Tupaki Desk   |   30 July 2021 1:34 PM GMT
అక్కినేని పేరుని తొలగించిన సమంత..!
X
'ఏమాయ చేసావే' తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత.. తన ఫస్ట్ హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా మారింది. ఇక పెళ్ళైన వెంటనే సోషల్ మీడియా మధ్యమాలలో కూడా తన పేరును సమంత అక్కినేని గా మార్చేసింది. ఈ క్రమంలో నటనను కొనసాగిస్తూ ఓవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. అయితే ఇప్పుడు సడన్ గా సామ్ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో 'అక్కినేని' పేరు తీసివేయడం చర్చనీయాంశంగా మారింది.

సామ్ ఇన్స్టాగ్రామ్ - ట్విట్టర్ ల ప్రొఫైల్ నేమ్ ఇన్నాళ్లూ 'సమంత అక్కినేని' అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ పేరు స్థానంలో 'S' అనే సింగిల్ లెటర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది అందరిలో అనేక సందేహాలను రేకెత్తించేలా చేసింది. ఉన్నట్టుండి సమంత ఇలా ఎందుకు చేసిందా అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్నారు. సామ్ ఏదైనా ప్రచార ప్రచారంలో భాగంగా ఇలా చేసిందా? క్యాజువల్ గా ఎడిట్ చేసిందా? అని ఆలోచిస్తున్నారు. మరి సమంత సోషల్ మీడియాలో డిస్ప్లే నేమ్ మార్చడానికి గల కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత గత కొన్నేళ్లుగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఈ క్రమంలో డీ గ్లామర్ రోల్స్ - బోల్డ్ క్యారక్టర్స్ - నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ వరల్డ్ లో అడుగులెత్తి సత్తా చాటింది. లైంగిక వివక్షకు గురైన ఎల్టీటీఈ సభ్యురాలు రాజీ అలియాస్ రాజ్యలక్ష్మి గా అద్భుతంగా నటించింది. ఈ సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు తమిళ్ లో నయనతార తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు సామ్.