Begin typing your search above and press return to search.

బన్నీ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్...?

By:  Tupaki Desk   |   2 July 2020 7:30 AM GMT
బన్నీ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్...?
X
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుండి వస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా అవడంతో అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే 'పుష్ప'లో బన్నీ కి జోడీగా ముందుగా వేరే హీరోయిన్ ని అనుకున్నారట సుకుమార్. ఆమె ఎవరో కాదు 'రంగస్థలం'లో రామలక్ష్మిగా అలరించిన స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని. 'పుష్ప' లో కూడా సమంత అయితేనే లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ కి న్యాయం జరుగుతుందని చిత్ర యూనిట్ భావించారట. అందులోనూ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ తో సామ్ ఓ సినిమా చేయాల్సి ఉందట. దీంతో పుష్ప పక్కన నటించమని సమంతని సంప్రదించారట.

అయితే ఆమెకు పాత్ర నచ్చినప్పటికీ ఈ మధ్య సినిమా సినిమాకి వేరియషన్ కోరుకుంటున్న సామ్ ఈ సినిమాలో నటించలేనని చెప్పిందట. దీంతో అప్పటికే 'భీష్మ' 'సరిలేరు నీకెవ్వరు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రష్మిక ని తీసుకున్నారట. కాగా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా పరిస్థితుల వలన ఆగిపోయింది. ఇక అన్నీ చక్కబడిన వెంటనే చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారు.