Begin typing your search above and press return to search.

తాప్సీ ఆఫ‌ర్ ని హోల్డ్ లో పెట్టిన స‌మంత!

By:  Tupaki Desk   |   15 May 2022 2:30 PM GMT
తాప్సీ ఆఫ‌ర్ ని హోల్డ్ లో పెట్టిన స‌మంత!
X
స‌మంత బాలీవుడ్ లాంచ్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తుంది. విడాకుల త‌ర్వాత కెరీర్ పై మ‌రింత ఫోక‌స్డ్ గా ప‌నిచేస్తుంది. బాలీవుడ్ లో తొలి సినిమాతోనే సంచ‌ల‌న తారగా వెలిగిపోవాల‌ని వెయిట్ చేస్తోంది. అలాంటి ఛాన్స్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ క్ర‌మంలో సామ్ కి తాప్సీ నిర్మాణ సంస్థ‌లో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో అవ‌కాశం వచ్చింద‌ని కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

ఇంకా విష‌యాన్ని క‌న్ప‌మ్ చేయ‌లేదు గానీ...సామ్ మాత్రం సాలిడ్ హీరోతోనే లాంచ్ అవ్వాల‌ని వెయిట్ చేస్తున్న‌ట్టు గుస‌గు వినిపిస్తుంది. స‌రైన క‌మ‌ర్శియ‌ల్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తేనే టాలీవుడ్ త‌ర‌హాలో బాలీవుడ్ లోనూ నిల‌దొక్కుకోవ‌చ్చ‌ని భావిస్తుందిట‌. ఈ క్ర‌మంలో తాప్సీ ఇచ్చిన ఆఫ‌ర్ ని హోల్డ్ లో పెట్టిన‌ట్లు వినిపిస్తుంది.

నేరుగా ఉమెన్ సెంట్రిక్ సినిమాతో లాంచ్ అయితే వ‌ర్కౌట్ అవ్వ‌ద‌ని భావించో ఏమో! తాప్సీని మాత్ర ఈ విష‌యంలో డిస్పాయింట్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. ఇది నిజ‌మే అయితే స‌మంత ఎనాల‌సిస్ కొంత వ‌ర‌కూ క‌రెక్టే. స‌మంత అక్క‌డ కొత్త ఫేస్. లేడీ ఓరియేంటెడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చేంత ఛ‌రిష్మా అక్క‌డ ఇంకా బిల్డ్ చేసుకోలేదు. అలాంటి ప్ర‌య‌త్నం చేస్తే చేతులు కాల్చుకున్న‌ట్లే. హీరోయిన్ గా కొంత ఐడెంటిటీ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌ధాన పాత్ర‌ల వైపు చూడొచ్చ‌న్న భావ‌న‌తోనే తాప్సీని హోల్డ్ లో పెట్టి ఉండొచ్చు.

ఇక స‌మంత యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి హిందీలో ఓ వెబ్ సిరిస్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే `ఫ్యామిలీ మ్యాన్ -2` తో హిందీలో గుర్తింపు తెచ్చుకున్న స‌మంత ఓటీటీ ప్లాట్ ఫాం పైమాత్రం వేగాన్ని త‌గ్గించ‌లేదు. ఈ క్ర‌మంలోనే రాజ్ అండ్ డీకే తెర‌కెక్కిస్తున్న మ‌రో కొత్త వెబ్ సిరీస్ లో న‌టించ‌డానికి అంగీక‌రించింది. వీటితో సంబంధం లేకుండా వెండి తెర అవ‌కాశాల కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

మ‌రి స‌మంత అనుకున్న‌ట్లు బాలీవుడ్ లో లాంచ్ అవుతుందా? తాప్సీ అవ‌కాశాన్నే స‌క్సెస్ గా మార్చుకునే దిశ‌గా పున‌రాలొచిస్తుందా? అన్న‌ది మరికొన్ని రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం స‌మంత టాల‌వుడ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `శాకుంత‌లం`...`య‌శోద` అనే రెండు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న కొత్త సినిమాకి ఎంపికైంది. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్ ద‌శలో ఉంది. స‌మంత సెట్స్ కి వెళ్తుంది.