నా స్నేహితుడు హార్ట్ బ్రేక్ అంటూ గుట్టు విప్పిన సామ్

Sun Feb 28 2021 22:00:02 GMT+0530 (IST)

Samantha opens about a secret friend!

ప్రతి ఒక్కరికీ బాల్యంలో ఎన్నో మధురస్మృతులు ఉంటాయి. కెరీర్ లో స్థిరపడి అన్నివిధాలా బిజీ లైఫ్ లోకి వచ్చాక వాటి విలువ తెలిసొస్తుంటుంది. ఓసారి అలా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కో సొంత ఊరికో వెళితే ఆ జ్ఞాపకాలు నిలువనివ్వవు.ప్రస్తుతం సమంత కూడా అలాంటి జ్ఞాపకాల్లోకే వెళ్లింది. ఇక తన ఇంటి టెర్రాస్ మీంచి ఒక కొండతో స్నేహం చేసిందట. తన విషయాలన్నీ ఆ కొండకే తెలుసునంటూ అసలు రహస్యం చెప్పేసింది. తన జీవితంలో రహస్య స్నేహితుడు ఉన్నాడా? అంటే అది ఆ కొండేనని కూడా తెలిపింది.

నయన్ తో విఘ్నేష్ తెరకెక్కిస్తున్న సినిమాలో సామ్ కూడా ఒక భాగం కావడంతో ప్రస్తుతం చెన్నయ్ లోని తన బాల్య స్మృతులు ఉన్నచోటనే ఉండేందుకు ఆస్కారం కలిగింది. ఆ క్రమంలోనే ఇలాంటివి ఎన్నో గుర్తుకొస్తున్నాయని తెలిపింది. తన  ఫస్ట్ లవ్.. హార్ట్ బ్రేక్.. పరీక్షల రోజు వేకువఝాము తపన..  దేవుళ్లకు మొక్కిన మొక్కులు.. ఇవన్నీ ఆ కొండకే తెలుసునని అంది.

 నా స్నేహితుల మరణం.. నా కన్నీటి వీడ్కోలు అనుభవం అంటూ చాలానే గుర్తు చేసుకుంది. మొత్తానికి తన ఫస్ట్ లవ్ గురించిన సీక్రెట్ ని కూడా ఈ సందర్భంగా అనాలోచితంగా బయటపెట్టేసింది సామ్.  కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం నయన్ తార- సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో సామ్ నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.