Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ షోలో బ్రేక‌ప్ పై ఓపెనైన స‌మంత‌!

By:  Tupaki Desk   |   3 July 2022 1:30 AM GMT
క‌ర‌ణ్ షోలో బ్రేక‌ప్ పై ఓపెనైన స‌మంత‌!
X
అక్కినేని నాగ‌చైత‌న్య నుంచి స‌మంత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్రేక‌ప్ ని అభిమానులు అస్స‌లు ఊహించ‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ స‌మంత కానీ చైత‌న్య కానీ త‌మ బ్రేక‌ప్ కి కార‌ణం ఏమిటో స్ప‌ష్ఠంగా చెప్ప‌లేదు. అయితే గ‌త కొంత‌కాలంగా అన్ని కార‌ణాల‌ను స‌మంత కాఫీ విత్ క‌ర‌ణ్ 7 షోలో ఓపెన్ గా చెప్పేస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో స‌మంత స్పెష‌ల్ చాటింగ్ పై అంతా ఆస‌క్తిగా దృష్టి సారించారు. సామ్ ఈ సీజ‌న్ లో అక్ష‌య్ కుమార్ తో క‌లిసి క‌నిపించ‌నున్నారు.

తాజాగా కాఫీ విత్ క‌ర‌ణ్ 7 ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం స‌మంత ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌తో క‌నిపించింది. షోలో `సంతోషక‌ర‌మైన వివాహాలు` గురించి స‌మంత‌కు ప్ర‌శ్న ఎదురైంది. దానికి తాను జ‌వాబు ఇచ్చారు. ఆ ప్ర‌శ్న వేసినందుకు కరణ్ జోహార్ ను సరదాగా నిందించారు స‌మంత‌. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సామ్ కి అరుదైన జాతీయ స్థాయి షో అని చెప్పాలి. ఈ షోలో విడాకుల గురించి ఓపెన‌వుతుంద‌ని అభిమానులు ఆశించారు. కానీ కాఫీ విత్ కరణ్ 7 ట్రైలర్ లో దీనిపై స‌రైన హింట్ క‌నిపించ‌లేదు. `సంతోషకరమైన వివాహాల` గురించి సామ్ మాట్లాడింది.

సామ్ ఈ ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్ తో క‌లిసి క‌నిపిస్తారు. ఇటీవల విడుదలైన కాఫీ విత్ కరణ్ 7 ట్రైలర్ లో సమంతా.... కరణ్ జోహార్ పై స‌ర‌దా పంచ్ లు విసిరింది. `సంతోషకరమైన వివాహాల`కు అతనిని నిందిస్తూ సరదాగా కనిపించింది. ``వాస్తవికత KGF అయినప్పుడు మీరు జీవితాన్ని K3Gగా చిత్రీకరించారు!`` అంటూ కరణ్ తో సామ్ ప‌రాచికం ఆడింది. ఈ ప్రకటనతో హోస్ట్ ఇబ్బంది స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. నిజానికి క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కించిన సినిమాల్లో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ప్ర‌ధానంగా హైలైట్ గా ఉండేది. దానిపై సామ్ పంచ్ వేసింది.

చైతన్య - సమంతా జంట‌ ఇంకా తమ బ్రేక‌ప్ వెన‌క కార‌ణాన్ని బహిరంగంగా మాట్లాడలేదు. అయితే త్వరలోనే అంతా మారే అవకాశం కనిపిస్తోంది. గత అక్టోబర్ లో సమంత- చైతన్య జంట విడిపోయారు. బ్రేక‌ప్ కి సంబంధించి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సమంత తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో చైతన్య తో ఉన్న‌ అన్ని చిత్రాలను తొలగించింది. ఏ వేదిక‌పైనా అతనిని అనుసరించలేదు. చైతన్య ప్రస్తుతం శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

KWK 7 గురించి మాట్లాడుతూ కరణ్ ఒక ప్రెస్ స్టేట్ మెంట్ లో ఇలా అన్నాడు. ``18 సంవత్సరాలకు పైగా వ్యక్తిగత సెలబ్రిటీ హాట్ స్పాట్ గా ఉంటాననే వాగ్దానం చేస్తున్నాను. కాఫీ విత్ కరణ్ స‌రికొత్త సీజ‌న్ తో తిరిగి వ‌స్తున్నందుకు సంతోషంగా ఉన్నాను.

బ్రేక్ లు లేకుండా ప్ర‌తిభావంతులైన‌ స్టార్స్ గెలాక్సీ కోసం ఇది పూర్తి ప్ర‌త్యేక‌ సీజన్ అవుతుంది. షోలో విష‌యాలు మరుసటి రోజు ముఖ్యాంశాలు కావడానికి ముందే వాటిని క్యాచ్ చేయాలనుకుంటే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ని ప్రతి గురువారం మీ ఇంటి వ‌ద్ద‌నే వీక్షించండి... అని అన్నారు.

సమంతా - అక్షయ్ తో పాటు క‌నిపించ‌నుండ‌గా.. కొత్త సీజన్ లో వరుణ్ ధావన్- అనిల్ కపూర్- సారా అలీ ఖాన్- జాన్వీ కపూర్- అనన్య పాండే, విజయ్ దేవరకొండ- షాహిద్ కపూర్- కియారా అద్వానీ- టైగర్ ష్రాఫ్- కృతి సనన్- రణవీర్ సింగ్- అలియా భట్ త‌దిత‌రులు ఉన్నారు.