బాలీవుడ్ లో నాలుగైదు.. మరి సౌత్ ఫ్యాన్స్ పరిస్థితి సామ్?

Mon Nov 29 2021 14:56:31 GMT+0530 (IST)

Samantha making movies in Bollywood

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టబోతుంది. ఆమె అభిమానులు ఖచ్చితంగా ఈ వార్తకు సంతోషిస్తారు. సమంత బాలీవుడ్ లో సినిమాలు చేయడం అంటే ఖచ్చితంగా వారికి గర్వంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కాని బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా సినిమాలు చేస్తేనే వారు సంతృప్తిగా ఉంటారు.కాని సమంత పద్దతి చూస్తుంటే మళ్లీ సౌత్ లో ముఖ్యంగా ఒక భాషలో ఆమె సినిమా చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ భాషకు చెందిన సామ్ అభిమానులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఖచ్చితంగా సమంత మళ్లీ మళ్లీ సౌత్ లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌత్ లో ఒకటి రెండు సినిమాల వరకే అంటే ఏకంగా నాలుగు అయిదు సినిమాలకు సామ్ కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ లో ఉన్న పద్దతి ప్రకారం సమంత వరుసగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నాలుగు అయిదు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుందని తెలుస్తోంది. వారు ఒకే సారి అయిదు సినిమాల్లో నటింపజేసే అవకాశం ఉంది. లేదంటే ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటింపజేసే అవకాశం ఉంటుంది.

కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారు ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. ఆ నాలుగు అయిదు సినిమాల్లో రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే సమంత బాలీవుడ్ లో ఫుల్ బిజీ అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న వారు సౌత్ లో నటించేందుకు ఆసక్తి చూపించరు అనే అభిప్రాయం కూడా ఉంది. కనుక సమంత సౌత్ లో ముందు ముందు నటించదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత వైవాహిక జీవితంకు ముగింపు పలికిన తర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. తెలుగు లో ప్రస్తుతం పుష్ప ఐటెం సాంగ్ లో నటిస్తున్న సమంత ముందు ముందు ఆమె హిందీ సినిమాలకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని.. ఐటెం సాంగ్ లేదా ప్రత్యేక పాత్రల కోసం మాత్రమే ఆమె సౌత్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మొత్తానికి టాలీవుడ్ మరియు కోలీవుడ్ లోని ఆమె అభిమానులు ఈ పరిణామాలతో కాస్త ఇబ్బంది పడటం ఖాయం. బాలీవుడ్ లో యశ్ రాజ్ బ్యానర్ లో వరుసగా నాలుగు అయిదు సినిమాల్లో నటించడం అంటే ఖచ్చితంగా మంచి బ్రేక్ లభిస్తుంది. దాంతో సమంత బాలీవుడ్ లో పాపులర్ అయ్యి అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ వస్తున్నాయి. సమంత తెలుగు లో శాకుంతలం సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. తమిళంలో కూడా ఈమె ఒక సినిమా చేసింది. ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల అవ్వబోతుంది.