Begin typing your search above and press return to search.

ఎడ్యుకేష‌న్ బిజినెస్ లో అక్కినేని కోడ‌లు

By:  Tupaki Desk   |   28 Jan 2020 4:19 AM GMT
ఎడ్యుకేష‌న్ బిజినెస్ లో అక్కినేని కోడ‌లు
X
దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోవ‌డం సెల‌బ్రిటీల‌కు అల‌వాటే. రెస్టారెంట్లు.. జిమ్ములు.. హోట‌ళ్లు.. ప‌బ్బులు.. బొటిక్ లను మ‌హాన‌గ‌రాల్లో ర‌న్ చేస్తోన్న సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు. సినిమా కెరీర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలీదు కాబ‌ట్టి ప్ర‌త్యామ్న‌యంగా సొంతంగా బిజినెస్ లు చేస్తుంటారు. హీరోలు..హీరోయిన్లు...ద‌ర్శ‌కులు..నిర్మాత‌లు ర‌క‌ ర‌కాల వ్యాపారాల్ని ఎంచుకుని ఇక్క‌డా రాణిస్తున్నారు. అటు సినిమాల ద్వారా వ‌చ్చే లాభాల‌ను వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెడుతూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఇక ఫిల్మ్ కెరీర్ చ‌ర‌మాంకంలో ఉన్న వాళ్లు ఇంకాస్త ముందు చూపుగా వ్య‌వ‌రిస్తున్నారు.

తాజాగా అక్కినేని కోడ‌లు స‌మంత కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉండ‌గానే వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాలు త‌గ్గించి నిర్మాత‌గా తొలి అడుగులు వేస్తోంది. అలాగే బుల్లితెర‌ డిజిట‌ల్ ఎంట్రీపైనా ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్ధం గా దూసుకెళుతోంది. `ఫ్యామిలీ మేన్ -2` అనే వెబ్ సిరీస్ లో స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే. డిజిట‌ల్ ప్లాట్ ఫాం పై కూడా స‌క్సెస‌వ్వాల‌నే ఉద్ధేశంతోనే తెలివిగా సినిమాలు త‌గ్గించి ఇటు వైపు గా వెళుతోంది. భ‌విష్య‌త్ డిజిట‌ల్ దే కాబ‌ట్టే...ముందుగానే త‌న‌ని ప‌రిచ‌యం చేసుకుంటోంది. అలాగే ఇత‌ర‌త్రా బిజినెస్ ల‌ పైనా స‌మంత సీరియ‌స్ గానే అడుగులు వేస్తోంది. హైదరాబాద్ కు చెందిన మాజీ మిస్.. ఫ్యాష‌నిస్టా శిల్పా రెడ్డి తో క‌లిసి ప్రీస్కూల్ ప్రారంభిస్తోంది. అందుకోసం ఖ‌రీదైన జూబ్లీ హిల్స్ ఏరియాని ఎంపిక చేశార‌ట‌.

ప్రీ స్కూల్- న‌ర్స‌రీ- ప్రైమ‌రీ స్కూల్ - పీపీ-2 స్కూళ్ల‌ను అధునాత‌నంగా లాంచ్ చేయాల‌న్న‌ది ప్లాన్. `ఏకం` అనే టైటిల్ ని ఎంపిక చేశారు. ఈ స్కూల్స్ లో పిల్ల‌కు ప‌ర్యావ‌ర‌ణంపైనా అవ‌గాహ‌న‌కు సంబంధించి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. పిల్ల‌ల‌ వ‌య‌సును బ‌ట్టి వివిధ ర‌కాల కోర్సుల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. హైద‌రాబాద్ లోనే ది బెస్ట్ స్కూల్స్ గా నిల‌పాల‌న్న‌ది స‌మంత ప్లాన్. ఇక భ‌ర్త చైత‌న్య సాయం ఎంత‌వ‌ర‌కూ? అన్న‌ది తెలియాల్సి ఉంది. చైతూ .. విదేశాల్లో బిజినెస్ స్ట‌డీస్ పూర్తి చేసాడు. మ‌రి చై స‌ల‌హా మేర‌కే స‌మంత ఇలా ఇన్నోవేటివ్ గా ప్ర‌య‌త్నిస్తోందా? సొంత ఐడియా తో ముందుకెళుతోందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే ఎడ్యుకేష‌న్ రంగం లో మంచు విష్ణు అమెరికన్ ప్రీఎలిమెంట‌రీ స్కూల్స్ ప్రాంచైజీ ల‌ను క‌లిగి ఉన్నాడు. జీవితారాజ‌శేఖర్- న‌టి రాశి కూడా స్కూల్ బిజినెస్ లో రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విద్య వ్యాపారంగా మారిన వేళ క‌నీసం వీళ్ల‌యినా సామాజిక త‌త్ప‌ర‌త‌తో స్కూల్స్ నిర్వ‌హించాల‌ని ఆకాంక్షిద్దాం.