Begin typing your search above and press return to search.

మాట‌ల‌తో కాకుండా సామ్‌ చేత‌ల‌తో చెబుతోంది!

By:  Tupaki Desk   |   2 Feb 2023 8:44 PM GMT
మాట‌ల‌తో కాకుండా సామ్‌ చేత‌ల‌తో చెబుతోంది!
X
హీరోయిన్ స‌మంత గ‌త కొంత కాలంగా మ‌యోసైటీస్ తో బాధ‌ప‌డుతూ చికిత్స పొందింది. విష‌యం బ‌యట‌ప‌డిన ద‌గ్గ‌రి నుంచి అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ త‌ను క్షేమంగా తిరిగి రావాల‌ని, వీలైనంత త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ధ‌న‌లు చేశారు. ఈ స‌మ‌యంలో స‌మంత‌కు మేమున్నామంటూ మాన‌సిక ధైర్యాన్ని అందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా భారీ స్థాయిలో నెటిజ‌న్ లు సామ్ కు అండ‌గా నిల‌వ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే ఫైన‌ల్ గా త‌న ఆరోగ్యం కుదుట ప‌డ‌టంతో స‌మంత 'సీటాడెల్' వెబ్ సిరీస్ షూట్ లో పాల్గొంటోంది.

హాలీవుడ్ డైరెక్ట‌ర్స్ రుస్సో బ్ర‌ద‌ర్స్ రూపొందించిన ఇంగ్లీష్ వెర్ష‌న్ ని ఇండియ‌న్ వెర్ష‌న్ గా స‌మంత‌తో 'ది ఫ్యామిలీ మ్యాన్‌' సిరీస్ సృష్టిక‌ర్త‌లు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ ఇటీవ‌లే ముంబైలో మొద‌లైంది. ఈ విష‌యాన్నివెల్ల‌డిస్తూ ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. స‌మంత‌ 'సీటాడెల్' షూటింగ్ లో పాల్గోంటోంద‌ని స్ప‌ష్టం చేయ‌డం తెలిసిందే.

ఈ ట్వీట్ లో సామ్ అడ్డంగా దొరికి పోయింది. విజ‌య్‌ దేవ‌ర‌కొండ 'ఖుషీ' మూవీ షూటింగ్ ని ప‌క్క‌న పెట్టి 'సీటా డెల్‌' సిరీస్ షూట్ లో పాల్గొంటోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో సామ్ పై విజ‌య్ అభిమానులు ఒకింత అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌డం, దానికి సామ్ సారీ చెప్ప‌డం.. ఆ సారీని రీ ట్వీట్ చేస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ 'ముందు నువ్వు పూర్తి స్థాయిలో కోలుకోవ‌డ‌మే మాకు కావాల‌ని' స్పందించ‌డం తెలిసిందే.

అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన సామ్ లో మునుప‌టి గ్లో క‌నిపించ‌డం లేద‌ని, ఫిజిక‌ల్ కండీష‌న్, లాంగ్ హెయిర్‌ కూడా ఫిట్ గా లేదంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి.

అయితే ఈ కామెంట్ ల‌పై నేరుగా స్పందించ‌ని స‌మంత త‌న చేత‌ల‌తో కామెంట్ ల‌కు గ‌ట్టి రిప్లై ఇస్తోంది. 'సీటా డెల్‌' సిరీస్ షూట్ లో పాల్గొంటోంద‌ని అమెజాన్ ప్రైమ్ వెల్ల‌డిస్తూ ఓ ఫొటోని పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఫొటోలో సామ్ గార్జియ‌స్ గా క‌నిపించి షాకిచ్చింది. బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారానికి పూర్తి భిన్నంగా మునుప‌టికి మించిన గ్లామ‌ర్ తో సామ్ క‌నిపించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. ఇదిలా వుంటే తాజాగా స‌మంత మ‌రో ఫోటో షూట్ లో మెరిసింది.

బాలీవుడ్ కు చెందిన ఫేమ‌స్ ఫొటోగ్రాఫ‌ర్ నేతృత్వంలో సామ్ ప్ర‌త్యేక ఫొటో షూట్ లోనూ పాల్గొంది. ఇందులోనూ సామ్ మ‌రింత గ్లోతో గ్లామ‌ర్ గా క‌నిపించి క‌నువిందు చేస్తోంది. ఇందుకు సంబ‌ధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇలా త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై స‌మంత నేరుగా స్పందించ‌కుండా చేత‌ల‌తో స‌మాధానం చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.