గాడ్ ఆఫ్ యాక్టింగ్ అంటూ సామ్ ప్రశంస ఎవరిపై?

Wed May 25 2022 20:13:34 GMT+0530 (India Standard Time)

Samantha calls Christian Bale God of acting

అవెంజర్స్ లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీతో పాటు ఎన్నో భారీ ఫ్రాంఛైజీలను రన్ చేస్తున్న మార్వెల్ కి అభిమాని కానిది ఎవరు?  ఈరోజుల్లో ఏదైనా తెలుగు బ్యానర్ గురించి అడిగితే వెంటనే చెప్పలేరేమో కానీ మార్వల్ సినిమాస్ అని అడిగితే వెంటనే డీటెయిల్స్ చెప్పేంతగా సదరు హాలీవుడ్ బ్యానర్ తెలుగు లోగిళ్లలో అభిమానుల్లోకి దూసుకుపోయింది.ఇప్పుడు మార్వల్ అభిమానుల జాబితాలో కొత్త పేరు రివీలైంది. సమంతా రూత్ ప్రభు ఈ రోజు ప్రతి మార్వెల్ అభిమాని గర్వించే రీతిలో ట్వీట్లు వదిలారు. మార్వెల్ స్టూడియోస్ థోర్: లవ్ అండ్ థండర్ ట్రైలర్ ను విడుదల చేయగా సామ్ తన ఫానిజం చాటుకున్నారు. ఈ చిత్రం క్రిస్ హేమ్స్‌వర్త్- నటాలీ పోర్ట్‌మన్ - టెస్సా థాంప్సన్ ల పునరాగమనంతో ఆకట్టుకోనుంది. అయితే ట్రైలర్ లో అతిపెద్ద హైలైట్ క్రిస్టియన్ బాలే రోల్.. గోర్ ది గాడ్ బుట్చర్. అతడి లుక్ సమంతను విపరీతంగా ఆకట్టుకుంది. నిజానికి సామ్ మొదట హేమ్స్ వర్త్ రోల్ ని ప్రస్థావించే పోస్టర్ ను షేర్ చేసింది. కొన్ని ఫైర్ ఎమోజీలతో `డెడ్` అని రాసింది. ఆమె బేల్ గాడ్ బుట్చేర్ రూపాన్ని అతనిని ప్రశంసిస్తూ ఒక వ్యక్తిగత పోస్ట్ ను భాగస్వామ్యం చేసింది. ది గాడ్ ఆఫ్ యాక్టింగ్ !!  అంటూ బేల్ అనే హ్యాష్ ట్యాగ్ తో పాటు పోస్ట్ చేసింది.

థోర్: లవ్ అండ్ థండర్ లో గాడ్ ఆఫ్ థండర్ గా క్రిస్ హెమ్స్‌వర్త్ తన పాత్రను తిరిగి పోషిస్తున్నాడు. అతను అనేక MCU సినిమాల లీడ్ హీరోగా కనిపించారు. ఇప్పుడు తాజా ముఖాలతో కలిసి నటించారని ట్రైలర్  ధృవీకరించింది. క్రిస్ ప్రాట్ - ఇతర గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ తిరిగి వస్తున్నారు. MCU సూపర్ హీరోలు ఎవెంజర్స్: ఎండ్ గేమ్ లో థానోస్‌ను ఓడించిన తర్వాత జరిగిన సంఘటనలతో పాటు కనిపిస్తారు. నటాలీ పోర్ట్‌మన్ కూడా జేన్ ఫోస్టర్ గా తిరిగి వస్తోంది. లవ్ అండ్ థండర్ మైటీ థోర్ గా ఆమె అరంగేట్రానికి సిద్ధంగా ఉంది.

ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ వీక్లీతో మాట్లాడుతూ దర్శకుడు తైకా వెయిటిటి ఇలా అన్నారు. ``నేను చేయకూడదనుకున్నది మళ్లీ రాగ్నారోక్ ని చేయడం.. ఎందుకంటే అది పూర్తయింది. మొత్తం విషయం వెలుగులోకి రావడానికి నేను సృజనాత్మకంగా ఉద్దీపన చెందుతున్నట్లు నిర్ధారించుకోవడానికి నేను నా కోసం మరింత ఆసక్తికరంగా ఏదైనా చేయవలసి ఉంది. నేను అనుకున్నాను ఈ ఫ్రాంచైజీతో కనీసం ఆశించిన విషయం సాధిస్తాను అని!`` అంటూ ఎమోషనల్ నోట్ రాసారు.

సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో తన కొత్త చిత్రం ఖుషి కోసం మంచు కొండల్లో కి పయనించింది. అక్కడ ఎగ్జోటిక్ లొకేషన్లలో తొలి షెడ్యూల్ ను ముగించింది. టీమ్ సభ్యులు ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ లో ఉన్నారు. సామ్ తరచుగా అభిమానులకు లోయ నుండి తమ ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నారు.