బాబోయ్ సామ్.. ఎందుకు ఇంత కష్టం?

Mon Oct 18 2021 16:00:01 GMT+0530 (IST)

Samantha Workout Photo

స్టార్ హీరోయిన్ సమంత వర్కౌట్స్ విషయంలో రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఫిజిక్ విషయంలో ఆమె ఎంత జాగ్రత్త తీసుకుంటుందో గతంలో చూసిన వీడియోలు మరియు ఫొటోలు చెప్పకనే చెప్పాయి. ఆమె ఎంతో కష్టమైన వర్కౌట్స్ ను ఈజీగా చేస్తూ ఉంటుంది. సింపుల్ గా సమంత చేసే వర్కౌట్స్ ను కొందరు హీరోలు కనీసం ఎందుకు అంత రిస్క్ అని ట్రై కూడా చేయరు. తాజాగా సమంత చేసిన మరో రిస్కీ వర్కౌట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సమంత పది కాదు ఇరవై కాదు ఏకంగా 30 కేజీల డంబెల్ ను రెండు చేతులతో లిఫ్ట్ చేస్తూ వర్కౌట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంత బరువున్న డంబెల్ తో వర్కౌట్ అంటే అస్సలు మామూలు విషయం కాదు. స్టార్ హీరోలు సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే వారు మాత్రమే ఆ స్థాయి బరువులు ఎత్తుతారు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమంత ఇప్పటికే చాలా ఫిట్ గా ఉంటుంది.. ఆమె ఎప్పుడు కూడా డైట్ ను ఫాలో అవుతూనే ఉంటుంది. కనుక రెగ్యులర్ గా సింపుల్ వర్కౌట్స్ చేసినా కూడా అదే ఫిజిక్ ను మెయింటెన్ చేయవచ్చు. కాని సమంత మాత్రం రెగ్యులర్ గా కనీసం రెండు నుండి మూడు గంటల వరకు వర్కౌట్లు చేస్తూ ఉంటుంది. ఇక డైటింగ్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదు అంటుంది. ఆదివారంలో కాస్త ఎక్కువ తింటుంది తప్ప ఏ సమయంలో కూడా ఆమె అస్సలు తినదు అంటూ ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. గతంలో సమంత వర్కౌట్ వీడియోలు ఫొటోలతో పోల్చితే ఈసారి 30 కేజీల వర్కౌట్ మరింత సీరియస్ గా ఉందంటూ ఆమె అభిమానులు చెబుతున్నారు. ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు సమంత అంటూ చాలా మంది ఆమెను ప్రశ్నిస్తున్నారు.

నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల సంఖ్య కాస్త తగ్గించింది. అయితే పెళ్లి తర్వాత ఆమె చేసిన కొన్ని సినిమాలే అయినా మంచి సినిమాలను చేసి నటిగా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు చైతూ నుండి సామ్ విడిపోయింది. ఈ సమయంలో ఆమె మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్దం అవుతోంది. ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా వచ్చిన గుర్తింపు మరియు పేరుతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని సమంత ఆశ పడుతోంది. అక్కడ మంచి పేరు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఫిజిక్ విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలకు పోటీ అన్నట్లుగా ఉండాలని వర్కౌట్లు చేస్తున్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి సామ్ వర్కౌట్ లు చూస్తుంటే ఒక్కోసారి భయంగా ఉంటుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.