సమంత లేట్ గా అయినా క్యూట్ గా..

Thu Jul 12 2018 10:11:11 GMT+0530 (IST)

Samantha Wished Nayanthara For Having Balls Of Steel

సినిమా రంగం అంటేనే పోటి.. అవకాశాల కోసం అందరితో పోటీపడాలి. ఇక హీరోలు హీరోయిన్లు అయితే పోటీపడి నటిస్తారు. ఫ్యాన్స్ కూడా హీరోలను బట్టి విడిపోయారు. అసూయ రాగద్వేషాలు కలిగిన ఈ రంగంలో సహనటుల గురించి రెండు మంచి మాటలు చెప్పడానికి అంగీకరించని రోజులివి. ఇలా అభినందించడానికి పెద్ద మనసు కావాలి. అది సమంతకు ఉందని తాజాగా నిరూపితమైంది. తనకు తమిళంలో గట్టి పోటీనిస్తున్న నయనతారను తాజాగా ప్రశంసించింది సమంత.  సమంత వ్యాఖ్యలు చూశాక ‘దటీజ్ సమంత.. చాలా బోల్డ్ మనిషి. తనకు ఏది అనిపిస్తే అది అనేస్తుంది’ అని ఆమె భర్త నాగచైతన్యనే ఇటీవల కితాబిచ్చాడు.తమిళంలో ఇప్పుడు నయనతార ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘కొలమావు కోకిల’ చిత్రం గురించి ఇప్పుడు తమిళనాట అంతా చర్చించుకుంటున్నారు. నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఇందులో కళ్యాణం వయసు అనే పాటను హీరో శివకార్తికేయన్ స్వయంగా రచయితగా మారి రాయడం విశేషం. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈ నెల 5న రిలీజ్ అయిన ట్రైలర్ కు విశేష ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ను 38 లక్షల మంది చూశారు. ఇదో రికార్డు..

ఇక తాజాగా ఈ టీజర్ తనకు విపరీతంగా నచ్చిందని సమంత ట్వీట్ చేసింది. ‘కొంచెం ఆలస్యంగా చెబుతున్నానని తెలుసు. కోలమావు కోకిల ట్రైలర్ అద్భుతం. చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు. నయనతార కీర్తి - కిరీటాల్లో ఈ చిత్రం మరో డైమండ్ స్టోన్ గా నిలిచిపోతుంది’ అని సమంత పోస్టు చేసింది.  సహనటి గురించి ఇంత పాజిటివ్ గా స్పందించిన సమంతను అందరూ అభినందిస్తున్నారు.