Begin typing your search above and press return to search.

స‌మంత వ‌ర్సెస్ దీపిక‌.. తీవ్ర‌వాదులయ్యారు!!

By:  Tupaki Desk   |   23 Jan 2021 5:40 AM GMT
స‌మంత వ‌ర్సెస్ దీపిక‌.. తీవ్ర‌వాదులయ్యారు!!
X
తీవ్ర‌వాదం.. దేశ‌భ‌క్తి.. గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలో సినిమాలు ఎన్ని వ‌చ్చినా మెజారిటీ భాగం బ్లాక్ బ‌స్టర్ విజ‌యం సాధించాయి. ఇప్పుడు అదే తీవ్ర‌వాదం నేప‌థ్యంలో వ‌చ్చిన వెబ్ సిరీస్ లు అంత‌కుమించి సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే రూపొందించిన ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 1 చ‌క్క‌ని విజువ‌లైజేష‌న్ స్టోరీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

తొలి సీజ‌న్ బ్లాక్ బ‌స్టర్ అవ్వ‌డంతో సీజ‌న్ 2పైనా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సీజ‌న్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత చేర‌డంతో తెలుగు నాటా చాలా ఆస‌క్తి నెల‌కొంది. సీజ‌న్ 2లో తీవ్ర‌వాదిగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌తో స‌మంత స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నార‌ని లీకులు అందాయి.

`ఫ్యామిలీ మ్యాన్ 2` త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. స‌రిగ్గా స‌మంత త‌ర‌హాలోనే ఇప్పుడు దీపిక ప‌దుకొనే కూడా మ‌రో తీవ్ర వాదం బ్యాక్ డ్రాప్ సిరీస్ లో జాయిన్ కావడం ఉత్కంఠ పెంచుతోంది.

తీవ్ర‌వాదం నేప‌థ్యంలోని `స్పెష‌ల్ ఓపీఎస్` కూడా ఫ్యామిలీ మ్యాన్ అంత పాపుల‌ర్ సిరీస్.. ఇది కూడా పెద్ద‌ హిట్ట‌య్యింది.. స్క్రీన్ టైమ్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా యంగేజ్ చేస్తుంది. ఇప్పుడు స్పెష‌ల్ ఓపీఎస్ సీజ‌న్ 2లో దీపిక ప‌దుకొనే చేరారు? అన‌గానే అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది.

దీపిక ఇంత‌కుముందే యుఎస్ టాలెంట్ ఏజెన్సీ ఐసిఎమ్ ‌తో దీపికా పదుకొనే ఓ ఒప్పందంపై సంతకం చేశారు. XXX: రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ లో విన్ డీజిల్- డోన్నీ యెన్ - రూబీ రోజ్ లతో పాటు దీపికా పదుకొనే హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఐసిఎమ్ రూపొందిస్తున్న స్పెష‌ల్ ఓపీఎస్ 1.5 హిమ్మ‌త్ స్టోరీకి దీపిక సంత‌కం చేసింది. నీర‌జ్ పాండే ఈ సిరీస్ ని తెర‌కెక్కిస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.