Begin typing your search above and press return to search.

ఫిట్ నెస్ ఫ్రీక్ సామ్ టాప్ 5 భంగిమ‌లు

By:  Tupaki Desk   |   16 July 2020 5:00 AM GMT
ఫిట్ నెస్ ఫ్రీక్ సామ్ టాప్ 5 భంగిమ‌లు
X
ఇన్ ‌స్టాగ్రామ్ లో అక్కినేని కోడ‌లు సమంత స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. త‌న ఫాలోవ‌ర్స్ కి నిరంత‌రం ఏదో ఒక ట్రీట్ ఉంటుంది. ముఖ్యంగా అభిమానులకు ఆమె ఎంత ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న‌ది స్ప‌ష్ఠంగానే తెలిసొస్తుంది. యోగా- జిమ్ లో క్ర‌మం త‌ప్ప‌కుండా సామ్ టైమింగ్ మెయింటెయిన్ చేస్తుంటుంది. అంతేకాదు.. సమంత తరచూ కొన్ని క‌ఠిన‌మైన వ్యాయామ ప్రక్రియలను ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు వీడియోలను పంచుకుంటుంది. సామ్ ఫిట్నెస్ టిప్స్ ని నిత్యకృత్యాన్ని అనుస‌రించాలంటే చాలా స‌మ‌య‌మే కావాలి. 24 గంట‌లు స‌రిపోదు అంటే అతిశ‌యోక్తి కాదేమో!

ఒక ర‌కంగా సామ్ నెటిజ‌నులకు బెస్ట్ ఫిట్నెస్ ట్రైన‌ర్ అంటే త‌ప్పేమీ కాదు. త‌న‌ని ఫాలో అయిపోతే చాలు ప‌ర్ఫెక్ట్ ఫిట్నెస్ సాధ్య‌మేనన‌డంలో సందేహం లేదు. ఆమె తన జీవిత‌ భాగస్వామి నాగ చైతన్యతో పాటు నిరంత‌ర వ్యాయామ దినచర్యను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూనే ఉంది. ఈ జంట కొన్ని ప్ర‌త్యేక‌ యోగా భంగిమల్లో ఉన్న‌ప్ప‌టి ఫోటోలు ఇంటర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

ముఖ్యంగా కఠినమైన వ్యాయామానికి సంబంధించిన ఫోటోలు అక్కినేని ఫ్యాన్స్ లో వైర‌ల్ గా మారాయి. సామ్ అనుస‌రించే ఐదు ఫిట్నెస్ యోగా భంగిమ‌ల్ని ప‌రిశీలిస్తే... నాగ చైతన్యతో పాటు బ్యాలెన్సింగ్ యోగా భంగిమ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. అలాగే సామ్ తలక్రిందులు అస‌నం అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. మూడ‌వ‌ది `హెడ్ ‌స్టాండ్ పొజిష‌న్ లో.. చేతుల‌పై క‌ఠిన‌మైన‌ కేక్ వాక్ ఆస‌క్తిక‌రం. అలాగే హెవీవెయిట్ వర్కౌట్ లో సామ్ టోన్డ్ బాడీని ప్రదర్శించిన తీరు ఇంట్రెస్టింగ్. అలాగే సీరియ‌స్ గా కిక్ ‌బాక్సింగ్ సెషన్ తర్వాత ఆమె నేల‌పై ప‌డుకుని రిలాక్స్ అవుతున్న ఫోజు.. అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇవ‌న్నీ సామ్ ఇచ్చే బెస్ట్ టిప్స్ అనే చెప్పాలి.

సామ్ కెరీర్ సంగ‌తి చూస్తే.. గేమ్ ఓవర్ ఫేం అశ్విన్ శరవణన్ ద‌ర్శ‌క‌త్వంలో నాయికా ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌నుంది. ఇంకా టైటిల్ నిర్ణయించ‌ని ఈ చిత్రంలో ప్రసన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో `కాతు వాకులా రందు కాదల్` లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా న‌టిస్తుండ‌గా.. నయనతార ప్రధాన పాత్రలో కనిపించనుంది.