సమంత టాప్ -5 డిజైనర్ లుక్స్ వైరల్

Tue Sep 14 2021 07:00:02 GMT+0530 (IST)

Samantha Top 5 Designer Looks

సమంత టాలీవుడ్ లోనే క్రేజీ ఫ్యాషనిస్టాగా వెలిగిపోతోంది. ట్రెండ్స్ ని పరిచయం చేయడంలో ఐకానిక్ గాళ్ గా పాపులర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త  పోటో షూట్లతో సమ్ థింగ్ స్పెషల్ గా కనిపించడానికి సమంత ఇష్టపడుతుంది. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టే అల్ట్రా మోడ్రన్ లుక్స్ లో కట్టిపడేస్తుంది. ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరయ్యే టప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా కనిపించడానికి  ఇష్టపడుతుంది. ఇక అవార్డుల పంక్షన్లలలో సమంత ది బ ఎస్ట్ మెడ్రన్ గాళ్ గా  ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది. స్టైలింగ్ పరంగా మేకప్ పరంగా డిజైన్స్ పరంగా కొత్త కొత్త ప్రయోగాలకు సైతం వెనుకాడదు. అయితే వాటిలో కచ్చితంగా సౌకర్యాన్ని చూసుకుంటుంది. ముందు కంఫర్ట్ నెస్ చూసుకునే తర్వాత ఫైనల్ చేస్తుంది.తాజాగా సమంత కు చెందిన ఐదు మోడ్రన్ లుక్స్ వైరల్ గా మారాయి.  గతంలో సమంత వైడ్ లెగ్ ఫ్యాంట్ దరించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అందులో ఐదు రకాల మోడల్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వాటిలో  సమంత సమథింగ్ స్పెషల్ గా కనిపిస్తుంది. ఇలాంటి డిజైనర్ దుస్తుల్లో కచ్చితమైన ఎత్తు గుర్తించడానికి వీలుంటుంది. మొదటి  ఫోటోలో సామ్ పౌడర్ బ్లూ ప్యాంటు సూట్ లో కనిపిస్తుంది. ఇందులో  సామ్ టాప్ ఇన్నర్ లో తెలుపు-ఎరుపు పూలతో కూడిన నెక్ ధరించింది. హెయిర్  పోనీ టెయిల్ లో కనిపిస్తుంది. మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది.

మరో ఫోటో లో గ్లామప్ లుక్ లో కనిపిస్తుంది. చారల ప్యాంటు ..తెలుపు షర్ట్ ధరించి వయ్యారంగా ఫోజులిచ్చింది. మరో లుక్ లో టాప్ టూ బాటమ్ తెలుపు నెక్ లెన్ షర్ట్..ప్యాంట్ ధరించింది. చేతిలో హ్యాండ్  బ్యాగ్ తో  స్టైలిష్ ఐకాన్ గా ఎలివేట్ అవుతోంది. మరో ఫోటోలో బాస్ లేడీ లుక్ తో ఆకట్టుకుంటుంది.  టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ ధరించినా  ఓవైపు మాత్రం బ్లాక్ హ్యాండ్ ని కలిగి ఉంది. మరో డిజైన్డ్  డ్రెస్ లో సమంత ఫ్రెష్  లుక్ లో కనిపిస్తుంది. హాఫ్ షోల్డర్ టాప్ ..ప్రింటెడ్ వైట్ ప్యాంట్ ని దరించింది. ఇవన్నీ పాత ఫోటోలే అయినా  ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి.