వారిద్దరితో పోటీ పడేందుకే ఆ సినిమా చేస్తున్నా

Thu Feb 20 2020 19:07:04 GMT+0530 (IST)

Samantha To Share Screen With Nayanthara

ఇటీవల జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా జానుకు నటిగా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఓ బేబీ తర్వాత సమంత నటన ప్రతిభ కనబర్చే ఛాన్స్ ను జానుతో దక్కించుకుంది. తన నటన ప్రతిభను నిరూపించుకుంది. జాను తర్వాత మరో నటనకు ఆస్కారం ఉన్న సినిమాను చేసేందుకు సమంత సిద్దం అయ్యింది.ఈసారి తమిళంలో సమంత ఛాలెంజింగ్ రోల్ కు సిద్దం అయ్యింది. ఇటీవల తమిళంలో ఈమె కాత్తువక్కుల రెందు కాదల్ అనే చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించేందుకు కమిట్ అయ్యింది. అందులో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తుండటం విశేషం. ఇక ఆ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. ఈ ముగ్గురు కూడా నటనలో మాంచి పేరు ఉన్న వారే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

నయనతార నటిస్తున్న సినిమాలో మరో హీరోయిన్ గా ఎందుకు నటిస్తున్నారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు సమంత ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. విజయ్ సేతుపతి మరియు నయనతారలు మంచి ట్యాలెంటెడ్ పర్సన్స్. వారితో పని చేయడం ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. వారితో పోటీ పడి నటించే ఛాన్స్ దక్కుతుంది.

ప్రతిభావంతులైన వారితో పని చేసినప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఈ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పానంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.