Begin typing your search above and press return to search.

విడాకుల తర్వాత చనిపోతానని అనుకున్నా: సమంత

By:  Tupaki Desk   |   7 Dec 2021 7:55 AM GMT
విడాకుల తర్వాత చనిపోతానని అనుకున్నా: సమంత
X
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల తన భర్త అక్కినేని నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చై-సామ్ విడాకుల ప్రకటన వెనుక బలమైన కారణం ఏంటని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక రూమర్స్ వచ్చాయి.

విడాకుల వ్యవహారం మీద చైతన్య - సమంత ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. చై ఎప్పటిలాగే సైలెంట్ గా తన పని చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న సామ్.. అమ్మ చెప్పింది పేరుతో నిఘాడ అర్థాన్నిచే సూక్తులను షేర్ చేస్తూ వస్తోంది. మధ్యలో ఒకసారి తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ ను ఖండిస్తూ ట్వీట్ చేసింది.

తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటి వరకు నోరు విప్పని సమంత.. ఇప్పుడు ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖలు చేసింది. ''2021లో జరిగిన అన్ని వ్యక్తిగత విషయాల తర్వాత, నాకు ఎలాంటి అంచనాలు లేవు. నేను జాగ్రత్తగా వేసుకున్న ప్లాన్స్ అన్నీ కుప్పకూలాయి'' అని సమంత తెలిపింది.

"మీకు చెడు రోజులను ఎదుర్కొంటున్నా ఫర్వాలేదు. మీరు ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేస్తే దాన్ని వెంటనే అంగీకరించండి. దానిని అర్థం చేసుకోండి. సమస్యలతో పోరాడుతునే ఉండండి.. ఇది ఎప్పటికీ అంతంలేని ఓ యుద్ధం. 'ఇది నా సమస్య, అయితే ఇప్పుడు ఏంటి? నేను ఇంకా నా జీవితాన్ని గడపాలి' అని అనుకోవాలి''

''నేను ఇంకా నా జీవితాన్ని గడపాల్సి ఉందని నాకు తెలుసు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ నేను ఎంత బలంగా ఉన్నానని నేనే ఆశ్చర్యపోతున్నాను. నేను చాలా బలహీనురాలిని అనుకున్నాను. విడిపోయిన తర్వాత కృంగిపోయి చనిపోతానని అనుకున్నాను. కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉండగలనని అనుకోలేదు. ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది.. ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు'' అని సమంత చెప్పుకొచ్చింది.

అదే సమయంలో విడాకుల ప్రకటన తర్వాత తనపై వస్తున్న ట్రోలింగ్ పై సమంత మాట్లాడింది. ''నేను షరతులు లేని అంగీకారాన్ని డిమాండ్ చేయను. డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉండమని నేను అందరినీ ప్రోత్సహిస్తాను. అయితే మనం ఒకరినొకరం ప్రేమించుకోవచ్చు మరియు కరుణించవచ్చు. కాకపోతే వారి నిరాశను మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని అభ్యర్థిస్తాను'' అని సమంత వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉండగా సమంత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. రెండు ద్విభాషా చిత్రాలతో పాటుగా ఓ ఇంటర్నేషనల్ మూవీ కూడా అనౌన్స్ చేసింది. అలానే 'పుష్ప' సినిమా కోసం తొలిసారిగా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధపడింది సామ్. ఈ క్రమంలో 'యశోద' అనే పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించింది.

ఇక త్వరలోనే తన ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని ప్రకటించనుంది. ఏదేమైనా తన వ్యక్తిగత జీవితం విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్న సమంత.. ఆ ప్రభావం తన కెరీర్ మీద పడకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.