Begin typing your search above and press return to search.

అమ్మో.. సమంత స్కూల్ మార్కులు చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

By:  Tupaki Desk   |   29 May 2020 5:11 PM GMT
అమ్మో.. సమంత స్కూల్ మార్కులు చూస్తే దిమ్మతిరిగిపోద్ది!
X
అది 2010వ సంవత్సరం. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ సమంత. అసలు పేరు సమంత రుతుప్రభు. మత్తెక్కించే కొంటె చూపులు - కళ్లప్పగించే అందం - ఆకట్టుకునే అభినయంతో.. తొలి సినిమాతోనే సినీ ప్రియులను కట్టిపడేసిన సమంత.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 1987 ఏప్రిల్‌ 28న చెన్నై సమీపంలో గల పల్లావరంలో జన్మించిన సమంత. స్కూల్ కాలేజీ రోజులలో ఎలాంటి స్టూడెంటో.. ఎవరికైనా తెలుసా..? అభిమానులు మాత్రం మిలియన్లలో ఉన్నారు. సమంత ఎంతమంచి నటన కనబరుస్తుందో.. చదువులో అంతే మంచి ఫలితాలు రాబడుతుంది. ఇది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రూవ్స్ తో సహా చూపిస్తుంది సామ్.

సమంత స్కూల్‌ - కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు చూస్తే విషయం అర్ధమవుతుంది. సమంత 10 - 11వ తరగతుల్లో మంచి మార్కులు సంపాదించింది. సీఎస్‌ ఐ సెయింట్‌ స్టీఫెన్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌ లో చదివిన సమంతకు పదో తరగతిలో గణితం-పార్ట్‌-1లో 100కు 100 మార్కులు వచ్చాయి. వింటే ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంకోటి గణితం పార్టు-2లో 99 మార్కులు వచ్చాయి మరి దీనికేం అంటారు. అలాగే ఇంగ్లీష్‌ లో 90 మార్కులు.. మిగతా సబ్జెక్టుల్లో కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించింది. ఆ తరువాత హోలీ ఎంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ లో 11వ తరగతి చదివింది. అక్కడ కూడా ప్రతీ సబ్జెక్టులో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. సమంత ఫేస్‌ బుక్‌ పేజీలో తన ప్రోగ్రెస్ కార్డు ఫోటోలు సాక్ష్యాలుగా నిలుస్తూ తెగ చక్కర్లు కొడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి!