Begin typing your search above and press return to search.

#సామ్ ఫార్ములా.. రోమ్ వెళితే రోమ‌న్ లా బ్ర‌త‌కాలి

By:  Tupaki Desk   |   9 Jun 2021 4:30 AM GMT
#సామ్ ఫార్ములా.. రోమ్ వెళితే రోమ‌న్ లా బ్ర‌త‌కాలి
X
స‌మ‌కాలీన క‌థానాయిక‌ల్లో ఏ ఇత‌ర నాయిక‌తో పోల్చి చూసినా అక్కినేని కోడ‌లు స‌మంత ది బెస్ట్ అని నిరూపిస్తున్నారా? కెరీర్ ప‌రంగా వ్య‌క్తిగ‌త జీవితంలోనూ సామ్ ప్ర‌ణాళిక‌ ది బెస్ట్ అని ప్రూవ్ అవుతోందా? అంటే అవున‌నే అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. ముఖ్యంగా సామ్ టైమింగ్ గురించి తెలివి తేట‌ల గురించి ఇటీవ‌ల ముచ్చ‌టించ‌ని వారు లేరు.

పెద్ద తెర‌పై స్టార్ హీరోయిన్ గా వెలిగినంత మాత్రాన బుల్లితెర‌కు వెళ్ల‌కూడ‌ద‌ని రూల్ ఏం లేదు. ముఖ్యంగా ఓటీటీల్లో న‌టించ‌కూడ‌ద‌ని లేదా ఓటీటీ షోలు చేయ‌కూడ‌ద‌ని రూల్ ఏదీ లేదు. ఇలాంటి అడ్డు గోడ‌లు ఏవైనా ఉంటే వాట‌న్నిటినీ బ్రేక్ చేసి అన్నిచోట్లా స‌క్సెస్ చూపించ‌డంలో సామ్ ది బెస్ట్ అనిపించారు.

రోమ్ లో ఉంటే రోమ‌న్ లా బ్ర‌త‌కాలి అన్న‌ట్లుగా ఎక్క‌డికి వెళితే అక్క‌డ ఆడియెన్స్ మైండ్ సెట్స్ కి త‌గ్గ‌ట్లుగా న‌టించాలి. ఇదే స‌క్సెస్ ఫార్మూలాని స‌మంత ప‌ట్టేసారు. బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా అటు గ్లామ‌ర్ ఇటు ఫెర్ఫార్మెన్స్ తో స్టార్ రేంజ్ కి ఎదిగిన స‌మంత‌ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చాక‌ ట్రాక్ మార్చేసారు. బోల్డ్- యాక్ష‌న్ కంటెంట్ తో వెబ్ ఆడియెన్స్ కి ఆక‌ట్టుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 ఘ‌న‌విజ‌యంలో స‌మంత పాత్ర గురించే అంతా ముచ్చ‌టించుకుంటున్నారంటే త‌న ప్ర‌భావం ఎంత‌గా ఉందో అర్థం చేసుకోవాలి.

స‌మంత‌తో పాటు స్టార్ హీరోయిన్లు చాలామంది ఇలా వెబ్ డిజిట‌ల్ మీడియాలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ వారు స‌మంత రేంజులో న‌టించలేక స‌క్సెస్ అందుకోలేక‌పోయారు. దాదాపు అంద‌రు హీరోయిన్లు డిజిట‌ల్ వైపు అడుగులేస్తున్నారు. కానీ అంతగా ఉనికిని చాటుకోలేక‌పోతున్నారు. అందుకే ఇప్పుడు స‌మంత అంద‌రికీ రోల్ మోడ‌ల్ అని చెప్పాలి.