Begin typing your search above and press return to search.

ష్‌..! యంగ్ హీరో మొద‌టి పెళ్లాం వేరే!!

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:02 AM GMT
ష్‌..! యంగ్ హీరో మొద‌టి పెళ్లాం వేరే!!
X
సెల‌బ్రిటీల ప‌డ‌క గ‌ది ర‌హ‌స్యాల్ని ఓపెన్ చేయిస్తాం! అంటే .. ఓహో ఇది నిజ‌మా? సిగ్గు విడిచి ఓపెన్ గా ఎవ‌రైనా ఆ ర‌హ‌స్యాలు చెబుతారా? అనుకున్నారు. కానీ ఇది నిజ్జంగా నిజ‌మేన‌ని ప్రూవ్ చేస్తున్నారు `ఫీట్ అప్ విత్ స్టార్స్` హోస్ట్ ల‌క్ష్మీ మంచు. ఆరంభ‌మే టాప్ సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ప‌డ‌క గ‌ది ర‌హ‌స్యాల్ని రివీల్ చేయిస్తూ అబ్బో అనిపించేస్తున్నారు.

ల‌క్ష్మీ టాక్ షో ర‌స‌ర‌మ్యం కాబోతోంద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత‌కీ ఈ వారం ఎపిసోడ్ ఎవ‌రితో? అంటే.. అక్కినేని కోడ‌లు స‌మంత బెడ్ రూమ్ సీక్రెట్స్ గురించి ఓపెన్ చేయిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఈ ఎపిసోడ్ లో చైత‌న్య‌- స‌మంత జంట ప‌డ‌క గ‌దికి సంబంధించిన‌ చాలా సీక్రెట్స్ ని ఓపెన్ చేయ‌బోతున్నారు. బెడ్ రూమ్ లో ఎవ‌రికీ తెలీని సీక్రెట్స్ ని ఓపెన్ చేసేస్తున్నారు. ఈ ఇంట‌ర్వ్యూలో ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వేసి బోలెడ‌న్ని సీక్రెట్స్ ని ల‌క్ష్మీ మంచు చెప్పిస్తున్నారు.

అస‌లు మీ మ‌ధ్య‌ ప్రేమ‌క‌థ గురించి చెప్పండి అని అన‌గానే.. సామ్ కు హోస్ట్ కి మ‌ధ్య‌ కాస్త నిశ్శ‌బ్ధం రాజ్య‌మేలింది. ``నాకు ముందే మీ గురించి అంతా తెలుసు. పెళ్లికి ముందే మీమ‌ధ్య లివిన్ రిలేష‌న్ షిప్ ఉంద‌ని నాకు తెలుసు .. ఏదీ దాచ‌కుండా చెప్పు`` అంటూ రెట్టిస్తూ ప్ర‌శ్నించారు ల‌క్ష్మీ. అలాగే పెళ్లి త‌ర్వాత ఏ మూడు సంగ‌తులు బెడ్ రూమ్ మ్యాట‌ర్స్ ని మార్చాయి? అని ప్ర‌శ్నిస్తే.. సామ్ త‌న హ‌బ్బీకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ని బ‌హిర్గ‌తం చేశారు. ఆ సీక్రెట్ ఇంట్రెస్టింగ్.

చైత‌న్య‌కు త‌ల‌గ‌డ(పిల్లో) మొద‌టి భార్య‌. త‌న‌ని ఎప్పుడు ముద్దు పెట్టుకోవాల‌నుకున్నా మా ఇద్ద‌రి మ‌ధ్య‌లో అది అడ్డొస్తోంది.. అంటూ వాపోయింది సామ్. కొంద‌రికే తెలిసి చాలామందికి తెలియ‌ని ర‌హ‌స్యాన్ని ల‌క్ష్మీ లాక్ షో రివీల్ చేసేస్తోంద‌ని దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. చైత‌న్య‌- స‌మంత స‌హ‌జీవ‌నం గురించి ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కు మీడియా వ‌ర‌కూ తెలియొచ్చు ఇప్ప‌టివ‌ర‌కూ. ఈ ఎపిసోడ్ చూశాక మారుమూల ప‌ల్లెటూళ్ల జ‌నాల‌కు తెలుస్తుంద‌న్న‌మాట‌. అలాగే బెడ్ రూమ్ లో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా పిల్లో పాలిటిక్స్ గురించి జ‌నాల‌కు తెలిసిపోనుంది.. ప్చ్!! చివ‌రికి ఏదోలా స‌మంత చేతే ర‌హ‌స్యాలు చెప్పించేశారు. ఇలా టాప్ సెల‌బ్రిటీల బెడ్ రూమ్ ర‌హ‌స్యాలన్నిటినీ ఎవ‌రికీ తెలియ‌ని వాటిని ఓపెన్ చేసేయ‌బోతుండ‌డం విచిత్ర‌మే. ఇన్నాళ్లు మీడియా బెడ్ రూమ్ లో జొర‌బడి నేరం చేస్తోంది!! అంటూ గ‌డ‌బిడ చేసిన‌వాళ్లంద‌రికీ ఇదో క‌నువిప్పు!