ఖుషి కథ మార్చమన్న సమంత..!

Tue Jan 24 2023 11:34:31 GMT+0530 (India Standard Time)

Samantha Requested to Change Kushi Story

విజయ్ దేవరకొండ ఖుషి టీం కు సమంత పెద్ద షాక్ ఇచ్చిందట. అదేంటి అంటే ఖుషి సినిమా కథ మార్చమని చెప్పినట్టు టాక్. అదేంటి ముందు అనుకున్న కథకే కదా సమంత ఓకే చెప్పింది మరి ఇప్పుడు కథ ఎలా మారుస్తారు అని అనుకోవచ్చు. విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా కథలో విజయ్ దేవరకొండ డామినేషన్ ఎక్కువ ఉందని.. సమంత పాత్రకు అంత ప్రిఫరెన్స్ లేదని టాక్.అయితే లవ్ స్టోరీ కాబట్టి అలానే ఉంటుందని అనుకున్న సమంత తర్వాత మయోసైటిస్ వల్ల షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది. దానివల్ల ఖుషి సినిమాలో తన పాత్ర గురించి ఎక్కువ ఆలోచించే ఛాన్స్ దొరికింది. అందుకే ఖుషి టీం కు షాక్ ఇస్తూ కథ మార్చమన్నట్టు తెలుస్తుంది.

కథలో తన పాత్ర చాలా బలహీనంగా ఉందని.. తన ఇమేజ్ కు తగినట్టుగా కథలో కొద్దిపాటి మార్పులు చేయాలని చెప్పిందట. శివ నిర్వాణ తన మొదటి సినిమా నుంచి ప్రయోగాత్మక కథలనే చేస్తూ వస్తున్నాడు.

అతను చేసిన దానిలో టక్ జగదీష్ ఒక్కటే అంచనాలను అందుకోలేదు కానీ నిన్ను కోరి మజిలీ ఈ రెండు మంచి చిత్రాలు గా నిలిచాయి. అందుకే శివ మీద నమ్మకం ఉంచి సమంత కమిట్ అవ్వొచ్చు.. ఆల్రెడీ మజిలీ సినిమాలో అతనితో పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి డైరెక్టర్ ని నమ్మొచ్చు. అయితే ఖుషి విషయంలో సమంత ఎందుకో తన పట్టు విడవట్లేదని అంటున్నారు. మరి ఆమెకు నచ్చినట్టు కథలో మార్పులు చేస్తారా లేదా అన్నది చూడాలి.

ఆల్రెడీ సమంత గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా చేసింది. ఆ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో సమంత నటనకు నేషనల్ అవార్డ్ వస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ యశోదతో మరోసారి తన సత్తా చాటిన సమంత శాకుంతలం ఖుషి సినిమాలతో తన ఫ్యాన్స్ ని అలరించనుంది.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.