ఆ సమయంలో చైతూను తిట్టేస్తాను

Tue Apr 16 2019 07:00:01 GMT+0530 (IST)

Samantha On About Majili Movie

గతంలో ఎన్ని సక్సెస్ లు దక్కినా లేని ఆనందం ఇప్పుడు 'మజిలీ' విజయంతో సమంత చాలా సంతోష పడుతున్నట్లుగా అనిపిస్తుంది. మజిలీ చిత్రం కోసం ఆమె కాలి నడకన తిరుమల ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలోనే ఆమె ఆ సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో అర్థం అయ్యింది. పెళ్లి అయిన తర్వాత భర్తతో కలిసి నటించిన మొదటి సినిమా అవ్వడంతో పాటు - చైతూ కెరీర్ లో చాలా కీలకమైన సినిమా కూడా అవ్వడంతో సమంతకు మజిలీ చిత్రం సక్సెస్ పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది. తన సంతోషంను - సక్సెస్ ను మీడియాతో షేర్ చేసుకుంటూ వస్తోంది.తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ... మజిలీ చిత్రం సమయంలో నా సీన్స్ మాత్రమే కాకుండా చైతూ సీన్స్ ను కూడా మానిటరింగ్ చేసేదాన్ని - తగిన సలహాలు ఇస్తూ - సీన్ బాగా వచ్చేందుకు సూచనలు చేస్తూ ఉండేదాన్ని - అప్పుడు చైతూ నీకు ఎందుకు ఇబ్బంది ఆ విషయం డైరెక్టర్ చూసుకుంటాడు కదా అనేవాడు. నా గురించి ఆలోచించడంతో పాటు - నా భర్త గురించి - ఆయన సీన్స్ గురించి కూడా ఆలోచించడం నా భాద్యతగా నేను భావించాను అందుకే చాలా కష్టపడ్డాను.

చైతూ ఏదైనా సీన్ లో బాగా నటిస్తే అభినందిస్తాను బాగా నటించినందుకు పొంగిపోతాను. అదే ఏదైనా సీన్ లో ఆశించినట్లుగా నటించక పోతే నాకు కోపం వచ్చేస్తుంది. ఆ సమయంలో చైతూను తిట్టేస్తాను - సీన్ కు నటనకు ఏమైనా సంబంధం ఉందా అంటూ కోపగించుకుంటాను. మా ఇద్దరి మద్య మొదటే మంచి సినిమాలు చేయడం కోసం ఒకరి సలహాలు ఒకరు తీసుకోవాలనే ఒప్పందం ఉంది. అందుకే ఇద్దరం కూడా సినిమాల విషయంలో చర్చించుకుంటాం.

ఇక నేను ఒకేసారి అయిదారు సినిమాలు నటించకుండా చేసే ఒకటి లేదా రెండు సినిమాలపై పూర్తి దృష్టి పెట్టి చేయాలనేది నా అభిప్రాయం. అందుకే ఈమద్య ఎక్కువ సినిమాలకు కమిట్ కావడం లేదు. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. మజిలీ చిత్రంలో కొన్ని సీన్స్ కు అసలు గ్లిజరిన్ పెట్టుకోకుండానే నటించాను.

తమిళంలో నేను నటించిన సూపర్ డీలక్స్ లోని పాత్రపై విమర్శలు వస్తున్నాయి. స్వాతంత్య్ర భావాలు ఉన్న యువతి పాత్రను అందులో చేశాను. ఆ పాత్ర నాకు బాగా నచ్చడం వల్లే చేశాను. నటి అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. మనసుకు నచ్చే పాత్రలు విమర్శలు తెచ్చి పెడతాయని అనిపించినా చేయాలనుకుంటాను. ఇక సినిమాల్లో ముద్దులు రొమాన్స్ అనేవి ఉంటాయి. నటిగా అలాంటివి కామన్ నా వృత్తిలో అలాంటివి ఉంటాయి వాటి గురించి నాకు చైతూకు ఒక అవగాహణ ఉంది. అందుకే మా ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు తలెత్తవు అని భావిస్తున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.