Begin typing your search above and press return to search.

సమంత న్యూ బిజినెస్.. స్టార్ హీరోయిన్ని ఫాలో అవుతోందా..??

By:  Tupaki Desk   |   18 Jun 2021 2:30 PM GMT
సమంత న్యూ బిజినెస్.. స్టార్ హీరోయిన్ని ఫాలో అవుతోందా..??
X
దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తోంది అక్కినేని కోడలు సమంత. నాగచైతన్యతో పెళ్లి కాకముందే సామ్ స్టార్డం అందుకుంది. కానీ పెళ్లయ్యాక నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసుకుంటూ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం సామ్ తెలుగులో శాకుంతలం అనే ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమా చేస్తోంది. అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో కూడా తన సత్తా చాటుతోంది సామ్. యూత్ బాగా కనెక్ట్ అయ్యేవిధంగా మోడరన్ బిజినెస్ ఆలోచనలతో దూసుకెళ్తుంది. రోజురోజుకి టెక్నాలజీతో పాటు ఆధునికత కూడా పెరుగుతూ మార్పులు చెందుతోంది.

ఈ ఆధునిక టెక్నాలజీని సదుపాయాలను అనుసరించి సామ్ ఆన్ లైన్ ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసింది. 'సాకీ' అనే పేరుతో సామ్ అనుకున్న విధంగా తన బిజినెస్ ను జనాల్లోకి తీసుకొచ్చింది. ఇటీవలే ప్రారంభించిన ఈ ఫ్యాషన్ బిజినెస్ ప్రస్తుతం సమంతకు మంచి లాభాలు తెస్తోందట. ఫేవరేట్ హీరోయిన్ కావడంతో జనాలు, ఫ్యాన్స్ అలా కనెక్ట్ అవ్వడంతో బిజినెస్ ఊపందుకుందని చెబుతోంది. అలాగే ఆన్ లైన్ స్టోర్ కావడం జనాలకు కలిసి వచ్చింది. ఆన్ లైన్ కాబట్టి కేవలం ఒక ప్రాంతానికి దేశానికి అనే అడ్డులేకుండా.. విదేశాల నుండి సైతం ఆర్డర్స్ రావడం చెప్పుకోదగ్గ విషయమే. సాకీ స్టోర్ దుస్తులను అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా పంపిస్తున్నాం'' అంటూ ఇటీవలె పోస్టులో చేసింది.

మోడ్రన్ జనాన్ని ఆకర్షించేలా తన బ్రాండ్‌ను బాగానే ప్రమోట్ చేస్తోంది. అయితే సామ్ బిజినెస్ బాటలో స్టార్ హీరోయిన్ తమన్నాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తమన్నా ఐదేళ్లు కిందటే 'వైట్ అండ్ గోల్డ్' అనే పేరుతో ఆన్లైన్ జ్యువలరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదేబాటలో సామ్ కూడా సాకీ ఆన్ లైన్ స్టోర్ లోనే జ్యువలరీ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు సమాచారం. మరి మొత్తానికి అటు సినిమాల్లోను ఇటు బిజినెస్ లోను రాణిస్తూ అమ్మడు 'బ్యూటీ విత్ బ్రిలియంట్ బ్రెయిన్' అనిపించుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే సామ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఓటిటిలో అడుగుపెట్టింది. బోల్డ్ అండ్ డేరింగ్ క్యారెక్టర్ తో ప్రస్తుతం జనాల్లో సామ్ పేరు మారుమోగుతుంది. ప్రస్తుతం అమ్మడు శాకుంతలం, కాతువకుల రెండు కాదల్ సినిమాలు చేస్తోంది.