బాత్రూంలో టవల్ చుట్టుకొని.. సమంత మిర్రర్ సెల్ఫీ వైరల్..!

Thu May 12 2022 14:04:08 GMT+0530 (IST)

Samantha Mirror Selfie Goes Viral ..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన ఆలోచనలను అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఇన్‌స్టా స్టోరీలో ఆమె ఓ హాట్ మిర్రర్ సెల్ఫీ షేర్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.సమంత తన స్టైలిస్ట్ మరియు క్లోజ్ ఫ్రెండ్ అయిన నీరజా కోన నుండి వచ్చిన ఒక నోట్ ను రిసీవ్ చేసుకున్నానని తెలుపుతూ ఓ స్టీమీ మిర్రర్ సెల్ఫీని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో సామ్ ఫేస్ కనిపించినప్పటికీ.. ఆమె ఈ ఫోటో తీస్తున్నప్పుడు ఒక చేత్తో టవల్ ని మరో చేత్తో మొబైల్ పట్టుకొని ఉంది. దీనిని బట్టి ఆమె టవల్ చుట్టుకుందే తప్ప మరేమీ ధరించలేదని అర్థం అవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మిర్రర్ సెల్ఫీకి నీరజా కోనా రాసిన నోట్ ను కూడా అటాచ్ చేసింది సామ్. అందులో 'పాపా.. లవ్ యూ! నువ్ అద్భుతంగా ఉన్నావ్. అది గుర్తుంచుకో' అని రాసి ఉండటాన్ని గమనించవచ్చు. దీనికి సమంత క్యాప్షన్ ఇస్తూ 'ఆవ్ నీరజా.. నేను ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నాను. తిరిగి వచ్చేయ్. క్యూట్ నోట్ కి ధన్యవాదాలు' అని పేర్కొంది.

సమంత బాత్రూమ్ లో టవల్ పట్టుకొని మిర్రర్ సెల్ఫీ షేర్ చేయడంతో.. అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు విడాకుల తర్వాత మళ్ళీ హద్దులు చేరిపేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'పుష్ప' ఐటమ్ సాంగ్ లో క్లీవేజ్ షో చేయడమే కాదు.. ఇటీవల పలు మ్యాగజైన్స్ కు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేయడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.

ఇకపోతే సామ్ ఈ ఫొటోతో పాటుగా ప్రస్తుతం తాను విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న #VD11 కాశ్మీర్ షెడ్యూల్ విశేషాలు.. షూటింగ్ లొకేషన్స్ మరియు అక్కడ ఆనందంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కూడా ఆనందాన్ని పంచుతోంది. షూటింగ్ కోసం గత రెండు వారాలుగా కశ్మీర్ లో ఉన్న సమంత.. పహల్గామ్ ప్రాంతంలోని హోటల్ లో ఆనందిస్తున్న దృశ్యాలను పంచుకుంది.

విరామ సమయంలో 'ది అన్ టెథర్డ్ సోల్' అనే కొత్త పుస్తకం చదువుతున్న విషయాన్ని తెలిపింది సామ్. కశ్మీర్ లోని అందమైన లొకేషన్లలో షూట్ చాలా సాఫీగా సాగుతుండగా.. స్టార్ హీరోయిన్ మాత్రం తన ఖాళీ సమయాన్ని బుక్స్ చదవడానికి.. అక్కడి అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకుంటోంది. ఇటీవల #VD11 సెట్స్ లోనే సమంత మరియు విజయ్ దేవరకొండ తమ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

ఇక సమంత ఇతర సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన 'యశోద' అనే పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 13న విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో సమంత ఓ బాలీవుడ్ మూవీతో పాటుగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొననుంది.