ఒంటికి యోగా మంచిదేగా! సమంత అక్కినేని శీర్షాసనం టిప్!!

Wed May 12 2021 10:00:01 GMT+0530 (IST)

Samantha Latest Yoga Pose Goes Viral

సెకండ్ వేవ్ ఉధృతితో సెలబ్రిటీలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. షూటింగుల్ని నిలిపేసి స్వీయనిర్భంధంలో జాగ్రత్తగా ఉన్నారు. ఇక ఈ తీరిక సమయాల్ని యోగా-జిమ్ సెషన్స్ తో రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ఉన్నారు.రెగ్యులర్ ఫిట్నెస్ ఫ్రీక్ సమంత అందుకు మినహాయింపేమీ కాదు.  యోగా జిమ్ అంటూ నిరంతరం ఫిట్నెస్ కోసం సామ్ ఎంతగా ప్రణాళికాబద్ధంగా ఉంటారో తెలిసినదే. తాజాగా హైదరాబాద్ లోని తన ఇంట్లో ఇలా గోడ ఆసరాగా శీర్షాసనం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ని సామ్ షేర్ చేయగా అది అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.

తలకిందులుగా అసనం వేయాలంటే ఏదైనా సపోర్ట్ కావాలి. నెమ్మదిగా గోడ ఆసరా లేకుండానే సామ్ పూర్తిగా తన తలపైనే (మోచేతులను నేలపై ఆన్చి) బ్యాలెన్స్ చేసి శహభాష్ అనిపిస్తున్నారు. ఇది ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేనిది. సామ్ యోగాలో మలైకా శిల్పాశెట్టి తర్వాత అంతటి సీనియర్ అని అంగీకరించాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ``నేను ఇక్కడే ప్రారంభించాను. చలనం లేని హెడ్ స్టాండ్ తరువాత ... అక్కడే స్థిరంగా... నా జీవిత స్థితి (సిక్) లాగా`` అంటూ సామ్ వ్యాఖ్యను జోడించారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే .. సామ్ నటిస్తున్న శాకుంతలం షూటింగ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు చైతూ నటిస్తున్న థాంక్యూ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.