Begin typing your search above and press return to search.

'యాడ్ షూట్'లో పాల్గొననున్న స్టార్ హీరోయిన్..!!

By:  Tupaki Desk   |   11 Aug 2020 7:14 AM GMT
యాడ్ షూట్లో పాల్గొననున్న స్టార్ హీరోయిన్..!!
X
స్టార్ హీరోయిన్ సమంత పేరు సౌత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా మంచి ఫామ్ లో ఉన్న ఈ భామ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఓ బేబీ సినిమా విజయం సాధించిన తరువాత సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంతవరకు సమంత తరువాత ప్రాజెక్టు ఏమిటా అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పడు సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో సంచలనమే అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తరచు ఫిట్నెస్ సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా అమ్మడు అదే తరహాలో ఆమె ఇంస్తాగ్రాంలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలతో అందరిలోనూ ఆసక్తి పెంచింది.

అయితే సమంత త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నాగార్జున, పాయల్ రాజపుత్, కళ్యాణ్ దేవ్ ల తర్వాత షూటింగులో పాల్గొనబోతున్న నాలుగో సెలబ్రిటీ సమంత. అది కూడా ఆమె పాల్గొంటోంది సినిమా షూటింగులో కాదు. ఒక కమర్షియల్ యాడ్ కోసమట. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా షూటింగ్స్ మొదలయ్యాయి. కానీ తెలుగులో మాత్రం షూటింగ్స్ ప్రారంభించవద్దని ఖరాఖండిగా చెబుతున్నారట. తెలుగు వాళ్లంతా మరో రెండు నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. సమంత కూడా ఇంతవరకు బయటికి రాలేదు. మొన్న రానా పెళ్ళికి బయటికి వచ్చిందంటే మళ్లీ ఈ యాడ్ కోసమే బయటికి రానుందట. ఈ - కామర్స్ బిజినెస్ డెవలప్ అవుతుంది కనుక దాని ఆన్ లైన్ పోర్టల్ యాడ్ కోసం సామ్ పాల్గొనడానికి సిద్ధం అయ్యిందట. చూడాలి మరి మిగతా వారి స్పందన ఎలా ఉండబోతుందో..!