వీడియో: గ్యాప్ వచ్చినా 80 కేజీలు ఎత్తి అవతలేసింది!

Sat Jan 15 2022 10:23:33 GMT+0530 (IST)

Samantha In Gym

కండరగండడు అని పురుషపుంగవులను పిలిచేస్తాం కానీ ఇప్పుడు గండరగండ అని ఇలాంటి అందాల నాయికలను కూడా పిలవాల్సి ఉంటుంది. చూస్తుండగానే 80 కేజీల బరువును అవలీలగా అలా ఎత్తి అటేసింది సమంత. అందుకే తనకు తగ్గట్టుగానే నెటిజనులు స్పందిస్తున్నారు. ఇదేమైనా అంత సులువైనదా?   జిమ్ లో ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ స్టామినా బిల్డ్ కాదు. అలాంటిది ఈ ఫీట్ కోసం కరణం మల్లీశ్వరిలా మారిపోయి సమంత చేసిన సాహసం ఆశ్చర్యపరిచింది.స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ కి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నిరంతరం జిమ్ యోగా సెషన్స్ తో సామ్ యూత్ లో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. తన డెడ్-లిఫ్ట్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే ఆమె వాటిని చాలా షేర్ చేసింది. కానీ ఆమె వ్యక్తిగత  వృత్తిపరమైన జీవితంలో జరుగుతున్న అనేక విషయాల కారణంగా జిమ్ ని వదిలేసిందనుకుంటే పొరపాటేనని ప్రూవ్ చేస్తోంది. టోన్డ్ లుక్ కోసం ఒంపుసొంపుల రూపలావణ్యం కోసం సామ్ కష్టాన్నే నమ్ముకుంది. ఇప్పుడు ఇనుములా మారింది. ఇంకా చెప్పాలంటే రోబో ఉమెన్ లా మారింది. ప్రముఖ ట్రైనర్ జునైద్ షేక్ వద్ద మళ్లీ శిక్షణ పొందుతున్నానని త్వరలోనే మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నట్లు ఇటీవల సమంత వెల్లడించింది. భోగి రోజు సాయంత్రం ఆమె డెడ్ లిఫ్ట్ చేస్తూ తన కంబ్యాక్ ఏ రేంజులో ఉండబోతోందో అర్థమవుతోంది. తన స్టామినా తక్కువేం కాదు ఇంతకుముందు 150 కేజీల బరువు వరకూ సునాయాసంగా లిఫ్ట్ చేసిన సామ్ కొంత గ్యాప్ వల్ల తగ్గాల్సొస్తోంది. నెమ్మదిగా తిరిగి స్టామినాను బిల్డ్ చేస్తోంది. 80 నుంచి 100 .. అట్నుంచి 150 కేజీల వరకూ తిరిగి రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకా 75 కేజీల వద్దనే ఆగలేనని తెలిపింది. సామ్ స్ఫూర్తితో ఇప్పుడు చాలా మంది జిమ్ లలో రీజాయిన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ముగిసిన సభ్యత్వాలను ఉపసంహరించుకోవడానికి మళ్లీ ప్రేరణ పొందుతున్నారు.

సమంత మునుముందు భారీ ప్రణాళికలతో దూసుకెళుతోంది. ఫ్యామిలీమ్యాన్ -2` వెబ్ సిరీస్ తో సామ్ కి బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ క్రేజ్ తోనే ఉత్తరాదిన అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే తాప్సీ నిర్మాణ సంస్థలో రెండు ప్రాజెక్ట్ లకు సంతకం చేసిందని ప్రచారం సాగుతోంది. అలాగే పలు  బిగ్ ప్రొడక్షన్ హస్ లు సామ్ తో ఒప్పందాలు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.

సామ్ తొలిగా టాలీవుడ్ కమిట్ మెంట్లను పూర్తిచేయాలని భావిస్తోంది. గ్యాప్ లో బాలీవుడ్ లో బిజీ అయ్యే  ప్లాన్స్ చేస్తోంది. అక్కడ దీపిక.. తాప్సీ వంటి ప్రముఖ నాయికల నిర్మాణ సంస్థలకు కమిటవుతోంది. తదుపరి సమంత `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ తర్వాత రాజ్  అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న `స్పిన్ ఆఫ్ సిటాడెల్ `అనే మరో వెబ్ సిరీస్ కి కమిట్ అయింది. ఇందులో సామ్ గుఢచారి పాత్రలో కనిపించనుంది. వరుణ్ ధావన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇలా సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ జోరు చూపిస్తోంది. ఇక తెలుగులో ఆమె ప్రధాన పాత్రలో నటించిన `శాకుంతలం` విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. అలాగే `యశోద` అనే మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రంలోనూ సమంత నటిస్తోంది.