సామ్ ఫ్లాష్ బ్యాక్: దగ్గుబాటి పెళ్ళి ఫోటోలు

Tue Apr 23 2019 22:36:51 GMT+0530 (IST)

Samantha In Daggubati Family Wedding

ఇంగ్లిష్ లో "ఎ పిక్చర్ స్పీక్స్ ఎ థౌజండ్ వర్డ్స్" అనే పాపులర్ కొటేషన్ ఉంది.  అంటే ఒక వెయ్యి పదాల్లో చెప్పే విషయాన్ని ఒక పిక్చర్/ఫోటో చెప్పేస్తుంది అని రఫ్ గా మనం అనువాదం చేసుకోవచ్చు.  కానీ మన తుపాకీలో ఫోటో స్టొరీలు చూడండి.. అన్ని దాదాపు 200 నుండి 300 పదాల లోపే ఉంటాయి. అంటే దానర్థం.. ఇంకా 700 పదాలను రాయకుండా రైటర్లు వదిలేస్తున్నట్టేగా. సరే ఈ ఫ్యామిలీ పిక్స్ గురించి మాట్లాడుకునే సమయంలో ఆ స్పైసీ పిక్స్ సంగతి ఎందుకులెండి.  సమయం సందర్భం లేదని ఎవరైనా చిర్రుబుర్రులాడే అవకాశం  ఉంది. అందుకే అవి పక్కన పెట్టేసి డైరెక్ట్ గా అక్కినేని వారి కోడలు సామ్ పోస్ట్ చేసిన ఫోటోల టాపిక్ కే వెళ్ళిపోదాం.ఈమధ్యే విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం వినాయక్ రెడ్డి తో జరిగిన సంగతి తెలిసిందే.  జైపూర్ లో జరిగిన  డెస్టినేషన్ వెడ్డింగ్ కు సన్నిహిత బంధువులు.. మిత్రులు మాత్రమే హాజరయ్యారు.  వెంకటేష్ మేనల్లుడు కావడంతో నాగచైతన్య అన్ని కార్యక్రమాలకు హాజరయ్యాడు.  ఇక చైతు శ్రీమతి సమంతా సంగతి చెప్పనవసరం లేదు. దగ్గుబాటి వారింటి అమ్మాయిలాగా అందరితో కలిసిపోయి తెగ అల్లరి చేసింది.  గతంలో బైటకు వచ్చిన ఒక వీడియో క్లిప్ లో హ్యాండ్ రెజ్లింగ్ చేస్తూ తన బలం ఎంతో ప్రూవ్ చేసింది.

తాజాగా అదే పెళ్ళి నుండి కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఒక ఫోటోలో వెంకటేష్-నీరజ తో పాటుగా వెంకటేష్ డాటర్స్ ఉన్నారు. ఆ ఫోటోలో సమంత వారిలో ఒక మనిషిగా కలిసిపోయి పోజిచ్చింది.  మరో ఫోటోలో దగ్గుబాటి కుటుంబం లోని పెద్దవారితో పోజిచ్చింది. ఇద్దరు పెద్దవారు ఉండగా ఒకరు రామానాయుడు గారి సతీమణి రాజేశ్వరి గారు.  ఆవిడ సోఫాలో పైన కూర్చొని ఉంటే సమంతా కింద కూర్చొని ఏదో ముచ్చట్లు చెప్తూ నవ్వుతూ ఉంది.  ఈ ఫోటోకు 'నా ఫేవరెట్ పిక్' అనే క్యాప్షన్ ఇచ్చింది.

మూడో ఫోటో మాత్రం టిపికల్ సామ్ స్టైల్ లో ఉంది.  నాగ చైతన్య పక్కనే నిలబడి డ్యాన్స్ చేస్తూ ఫోటోకు పోజిచ్చింది.  చైతు తన యూజువల్ స్టైల్ లో స్మైల్ ఇస్తూ ఉన్నాడు. సామ్ దీనికి  ఒక కిరాక్ క్యాప్షన్ ఇచ్చింది "కామ్ గా ఉండే నా భర్త ప్రశాంతమైన జీవితం గడుపుదామని అనుకొని ఉంటాడు. కానీ దేవుడు మాత్రం ఇలా..".   అర్థం అయిందిగా.. ఆయనగారు ఎంత శాంతం అయినా హంగామాకు కేరాఫ్ అడ్రెస్ అయిన సమంతాను చైతు జీవితంలోకి పంపాడు.  దీనర్థం చైతు లైఫ్ అంతా ఫుల్ హంగామానే.  ఆ హంగామాను తట్టుకోలేక అలా చిరునవ్వుతో సరిపెడుతున్నాడు!