క్లిక్ క్లిక్ : ఆమెతో మళ్లీ సమంత హాలీడే ట్రిప్

Mon Jun 27 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Click Click ?: Samantha Holiday Trip Again With Her

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఒక వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన వ్యక్తిగత జీవితం ను అన్ని విధాలుగా ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆమె కొన్నాళ్ల క్రితం నాగ చైతన్య  నుండి విడిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి ఆమె గురించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉంది.షూటింగ్ లతో ఎప్పుడు బిజీగా ఉండే సమంత తన స్నేహితులతో ట్రిప్స్ వేస్తూనే ఉంటుంది. శిల్పా రెడ్డి మరియు సమంత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెల్సిందే. ఇద్దరు కలిసి అనేక సార్లు అనేక ప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు. శిల్పా తో టైమ్ స్పెండ్ చేయడం తనకు ఎంతో ఇష్టం అంటూ సమంత పలు ఇంటర్వ్యూల్లో మరియు పలు సందర్బాల్లో చెప్పిన విషయం తెల్సిందే.

ఇప్పుడు మరోసారి శిల్పా రెడ్డి తో కలిసి దుబాయ్ లో సమంత సందడి చేస్తోంది. శిల్పా సోదరి సాహితీ దుబాయ్ లో ఉంటారు. ఆమెతో పాటు శిల్పా మరియు సమంత లు సందడి చేశారు. బుర్జు ఖలీఫా వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సమంత ఇటీవల కాలంలో విదేశీ ప్రయాణాలు.. టూర్స్ ఎక్కువ అవుతున్నాయి అంటూ ఈ ఫోటోలకు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత సినిమాల విషయానికి వస్తే హీరోయిన్ గా శాకుంతలం సినిమా లో ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న శాకుంతలం సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరో వైపు ఈమె నటించిన యశోద సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. చాలా స్పెషల్ మూవీగా యశోద ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు కూడా సమంత స్థాయిని మరింతగా పెంచడం ఖాయం అంటున్నారు.

ఇక బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడి సినిమాల జోరు కొనసాగబోతుంది. ఇప్పటికే అక్కడ వెబ్ సిరీస్ తో అలరించిన ఈ అమ్మడు ముందు ముందు వరుస సినిమాలతో అలరించబోతుందట.