ఫోటో స్టోరీ : అక్కినేని కోడలి అందాలు అదరహో...!

Sun Aug 09 2020 14:00:02 GMT+0530 (IST)

Samantha Glamorous Pose in Saree

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేనేత వస్త్రాలకు విస్తృతంగా ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే. చేనేత వస్త్రాల ప్రచారం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేనేత వస్త్రాలకు ఎంతో బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తోంది. చేనేత వస్త్రాలతోనూ ఎంతో ఫ్యాషన్ గా కనిపించొచ్చని ఇప్పటికే మ్యాగజైన్ ఫొటోషూట్ లతో సమంత నిరూపించింది. కొత్త కొత్త డిజైన్స్ తో సమంత చేనేత దుస్తులను ధరించి అందరికి రోల్ మోడల్ గా నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలో లేటెస్టుగా సామ్ మరోసారి చేనేత వస్త్రాలను ధరించి అందంగా ముస్తాబయింది.దగ్గుబాటి రానా - మిహికా ల వివాహ వేడుక సందర్భంగా సామ్ నీలి రంగు చేనేత చీరలో కనిపించి పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఆమె ధరించిన నెక్లెస్ సామ్ అందాన్ని రెట్టింపు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. 'ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ధరించండి' అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం సామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి నెటిజన్స్ సమంతని పొగుడుతూ చేనేత వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అంతకు ముందు జరిగిన మెహిందీ ఫంక్షన్ లో కూడా సామ్ వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

కాగా సమంత తెలుగులో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. గతేడాది 'సూపర్ డీలక్స్' 'ఓ బేబీ' 'మజిలీ' సినిమాల్లో నటించిన సమంత ఈ ఏడాది తమిళ రీమేక్ 'జాను' సినిమాతో పలకరించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టబోతోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కి కొనసాగింపుగా వస్తున్న సీజన్ 2 లో సమంత నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. దీంతో పాటు తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది సామ్.