సమంత...కండిషన్స్ అప్లై...

Mon Oct 18 2021 19:00:01 GMT+0530 (IST)

Samantha Conditions Apply

సమంత మళ్ళీ బిజీ అవుతోంది. ఆమె సినిమా శాకుంతలం రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ తనకు మంచి పేరు తెస్తుందని గట్టిగా ఆమె నమ్ముతోంది. ఈ మూవీ తరువాత ఆమె వరసగా కొత్త సినిమాలకు కమిట్ అవుతోంది. ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోతుందని అక్కడే సెటిల్ అవుతుందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలా కోలీవుడ్ మూవీస్ లో కూడా నటించాలనుకుంటోందిట. అంతే కాదు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తే టాలీవుడ్ లోనూ నటించేందుకు రెడీ అంటోంది.అయితే సమంత కొన్ని కండిషన్లు మాత్రం పెడుతోంది అంటున్నారు. కేవలం స్క్రిప్ట్ నచ్చడమే కాదు షూటింగ్ విషయంలోనూ ఆమె షరతులు అంగీకరించిన నిర్మాతలకే సినిమాలు చేసే చాన్స్ ఉంది అంటున్నారు. ఆమె షరతులు ఏంటి అంటే తనతో సినిమా చేయాలనుకుంటున్న నిర్మాతలు తీస్తే చెన్నైలోనే తీయాలి. అక్కడే షూటింగు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన షరతు అంటున్నారు. ఒకవేళ కధ డిమాండ్ చేసిందనో ఇతర కారణల వల్లనో షూటింగ్ హైదరాబాద్ లో చేస్తే మాత్రం కచ్చితంగా ఇండోర్ లోనే చేయాలని కూడా కోరుతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.

ఇలా ఎందుకు అంటే సమంత నాగ చైతన్య విడిపోయారు విడాకులు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో జనంలో ఈ అంశం ఇంకా వేడిగానే ఉంది. దాంతో అవుట్ డోర్ షూటింగులు ఇప్పట్లో పెట్టుకుంటే అనవసర ప్రచారంతో పాటు మరింతగా ఇదే అంశం జనంలో నానుతూనే ఉంటుంది అన్న ముందు చూపుతోనే సమంత ఇలా కండిషన్లు అప్లై చేశారు అంటున్నారు. ఈ విషయంలో ఆమె గతంలో ప్రభుదేవాతో బ్రేకప్ తరువాత నయనతార అనుసరించిన విధానాన్నే ఫాలో అవుతున్నారు అంటున్నారు. తన ప్రైవసీకి ఎంటువంటి భంగం కలగకుండా చూసుకుంటూనే తన సినీ జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేయాలన్నది సమంత ఆలోచనగా ఉంది అంటున్నారు. మొత్తానికి సమంత కండిషన్లు బాగానే ఉన్నాయి. కానీ మేకర్స్ ఎంతవరకూ వీటిని ఆక్సెప్ట్ చేస్తారో చూడాలి. అయితే ఆమెతో సినిమాలు తీసేందుకు మేకర్స్ ఈ రోజుకీ రెడీగా ఉన్నారు కాబట్టి కండిషన్లు ఎలాంటివి
అయినా భరించగలరు అన్న మాట కూడా వినిపిస్తోంది.