జోరుతగ్గిన సమంత.. తగ్గించిందా..? తగ్గించేశారా??

Thu Apr 22 2021 16:00:02 GMT+0530 (IST)

Samantha Career In Dilemma

'సమంత..’ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఏళ్ల తరబడి వెలుగొందిన హీరోయిన్. నిజం చెప్పాలంటే.. పెళ్లైన తర్వాత కూడా సామ్ స్టార్ డమ్ తగ్గలేదు! అయితే.. ఇటీవల సినిమాలు తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. దీంతో.. ఆమే తగ్గించిందా? లేక తగ్గించేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.



2010లో ‘ఏమాయ చేసావే’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లింది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయిన సామ్.. ఇప్పటి వరకూ అదే ట్రాక్ రికార్డును మెయింటెయిన్ చేస్తూ వచ్చిందనే చెప్పాలి.

అయితే.. అగ్రశ్రేణి హీరోయిన్ గా ఉండగానే.. తన మొదటి హీరోనే రియల్ లైఫ్ హీరోగా సెలక్ట్ చేసుకుంది. 2017లో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది సమంత. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే.. ఇప్పుడు జోరు తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు.. ఈ అమ్మడి చేతిలో ఒకే ఒక సినిమా ఉంది.

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది సమంత. ఈ ప్రేమకావ్యంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సామ్.. ఏ చిత్రంలో నటిస్తోందన్న విషయంలో క్లారిటీ లేదు. పెళ్లైందని తానే సినిమాలు తగ్గించిందా? మేకర్స్ తగ్గించారా? అనేది తెలియట్లేదనే చర్చ సాగుతోంది. మరి దీనిపై సామ్ ఏమంటుందో?