సామ్ అత్తాకోడళ్ల ట్విన్ టేస్ట్

Tue Mar 26 2019 16:51:34 GMT+0530 (IST)

Samantha Attakodalla Twin Taste

అంత పెద్ద స్టార్ హీరో కుటుంబానికి కోడలిగా వెళ్లినా తనకంటూ ప్రత్యేకమైన మార్కును సృష్టించుకోవడంతో సమంతా ఎప్పుడు ముందుంటుంది. తాజాగా వెంకీ కూతురి పెళ్లిలో సందడి చేసిన సామ్ అత్తయ్య లక్ష్మి దగ్గుబాటి వేసుకున్న కాస్ట్యూమ్ లాంటిదే డిజైన్ తో సహా వేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది కాకతాళీయంగా జరిగిందని సామ్ చెబుతున్నా మరీ సేమ్ డ్రెస్ ఎలా వేసుకుంటారు అనేది నెటిజెన్ల ప్రశ్న. అయితే సామ్ చాలా తెలివిగా సమాధానం ఇస్తోంది.మగాళ్లు కాబోయే భార్య తల్లి లాంటిది రావాలని కోరుకుంటారని బహుశా అది ఇదేనేమో అంటూ ఎమోషనల్ టచ్ ఇస్తూనే చైతు ఫాన్స్ మనసులు గెలిచేసింది. ముగ్గురు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర క్లిక్ మనిపించిన ఫోటో వైరల్ అవుతోంది. చైతు తల్లి లక్ష్మి దగ్గుబాటి సాధారణంగా ఇలాంటి అకేషన్లో తప్ప బయట కనిపించరు. అలాంటిది ఇంత స్పెషల్ ఫంక్షన్ లో కోడలితో కలిసి ఇలా ఒకే పిక్ లో ఒకేలాంటి కాస్ట్యూమ్ లో కనిపిస్తే ఇద్దరు హీరోల అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది

చైతు సామ్ లు మనం తర్వాత కలిసి నటించిన మజిలీ ఏప్రిల్ 5 విడుదల కాబోతోంది. దీని రిజల్ట్ పట్ల ఇద్దరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పెళ్లయ్యాక నటించిన మొదటి సినిమా కాబట్టి సామ్ కు ఇది సెంటిమెంట్ గా కూడా మారింది. అందులోనూ నిజ జీవితంలోని భార్య భర్తల పాత్రలే ఇందులో పోషించడం మరో ఆకర్షణగా మారింది. ఇప్పటికే టీజర్ ప్లస్ మ్యూజిక్ మార్కెట్ లోకి వచ్చేశాయి. ట్రైలర్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల హడావిడి ఎంత ఉన్నా మజిలీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటుందన్న ధీమాలో ఉందీ జంట. చూద్దాం ఎలాంటి ఫలితం అందుకుంటారో.