అన్నపూర్ణ స్టూడియోస్ లో సమంత!

Thu Nov 25 2021 10:30:20 GMT+0530 (IST)

Samantha At Annapurna Studios

వృత్తిగత జీవితం వేరు .. వ్యక్తిగత జీవితం వేరు. ఈ రెండిటి మధ్యా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ని మెయింటెయిన్ చేస్తూ కాలాన్ని ముందుకు నడిపించడం ఎలానో తెలియాలి. ఈ విషయంలో టాప్ హీరోయిన్ సమంత ఎంతో క్లారిటీతో వ్యవహరిస్తున్నారు.లేటెస్టుగా సామ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యక్షమవ్వడం గుసగుసలకు తావిచ్చింది. ఇంతకీ దేనికోసం సామ్ అక్కడికి వచ్చింది? అంటూ చెవులు కొరుక్కుంటున్నారు జనం. నాగచైతన్య నుంచి విడిపోతున్నానని ప్రకటించాక అన్నపూర్ణ స్టూడియోస్ కి రావడం ఇదే తొలిసారి. అయితే తాను వచ్చింది వృత్తిగత కట్టుబాటును నెరవేర్చుకునేందుకు అని తెలిసింది.

ప్రస్తుతం గుణశేఖర్ `శాకుంతలం` డబ్బింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ డబ్బింగ్ థియేటర్ లో జరుగుతోంది. అక్కడికి సైలెంట్ గా కార్ లో వచ్చిన సామ్ ముసుగుతో దిగి తన పనిని ముగించుకుని అంతే చడీచప్పుడు లేకుండా వెళ్లిందనేది గుసగుస. వ్యక్తిగత విషయాలతో వృత్తిగత వ్యవహారాలకు ఇబ్బంది కలగకూడదన్న నియమం వర్తిస్తుంది. సామ్ చేసింది కూడా అదే. చై-సామ్ జంట విడాకుల దిశగా పయనిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కి సామ్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచినా అది తన వృత్తిలో భాగమేనని ఇప్పుడు గుసగుస వినిపిస్తోంది. నవంబర్ 23న చైతన్య పుట్టినరోజున సమంత శుభాకాంక్షలు చెప్పకపోవడం అక్కినేని ఫ్యాన్స్ కి నిరాశను కలిగించింది.