Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీమ్యాన్-2' లో స‌మంత ఫైట్స్

By:  Tupaki Desk   |   13 Oct 2019 6:58 AM GMT
ఫ్యామిలీమ్యాన్-2 లో స‌మంత ఫైట్స్
X
అక్కినేని కోడ‌లు అయిన‌ త‌ర్వాత స‌మంత కెరీర్ మ‌రింత ప‌రుగులు పెడుతోంది. సినిమా అవ‌కాశాల‌తో పాటు.. ఆల్ట‌ర్నేట్ కెరీర్ పైనా సామ్ కాన్సంట్రేట్ చేస్తోంది. ప్రస్తుతం అంతా డిజిట‌ల్ మయం. ఫ్యూచ‌ర్ కూడా డిజిట‌ల్ మాధ్య‌మాల‌దేన‌ని అర్థ‌మ‌వుతోంది. నెట్ ఫ్లిక్స్- అమెజాన్ లాంటి సంస్థలు ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల‌తో దూసుకుపోతున్నాయి. కార్పొరెట్ కంపెనీల‌న్నీ వెబ్ సిరీస్ దారి ప‌డుతున్నాయి. ఆ క్ర‌మంలోనే అక్క‌డ అవ‌కాశాలు పెరిగాయి. పెట్టుబ‌డులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. వెండితెర‌కు పోటీగా వెబ్ సిరీస్ ల‌తో నిర్మాత‌లు ఆదాయంలో ముందంజ‌లో ఉంటున్నార‌న్న‌ది ఓ స‌ర్వే. ఈ నేప‌థ్యంలో స్టార్లంతా అటువైపు మ‌ళ్లుతున్నారు. ఇదే దారిలో స‌మంత వెళుతోంది. ఇటీవ‌లే `ది ఫ్యామిలీ మ్యాన్` సీజ‌న్-2 వెబ్ సిరీస్ కి సామ్ ఒకే చెప్పింది. 96 రీమేక్ షూటింగ్ ని ఇటీవ‌లే స‌మంత పూర్తిచేసింది.

ఈ నేప‌థ్యంలో వెబ్ సిరీస్ షూటింగ్ కు స‌మాయ‌త్తమ‌వుతుంది. అయితే అంత‌కు ముందే స‌మంత త‌న లుక్ ని మార్చుకోవాల్సి ఉంటుంద‌ట‌. ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ -1 గ్రాండ్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో రెట్టింపు అంచ‌నాల‌తో దీన్ని తెర‌కెక్కిస్తున్నాన్నారు. దీంతో ప్ర‌తి పాత్రా సీజన్ 2లో హైలైట్ గా ఉండాలి. అది స‌మంత‌కు ఛాలెంజ్ కానుంది.

ఇందులో స‌మంత కీల‌క‌మైన పాత్రధారి. త‌న పాత్ర‌లో నెగెటివ్ షేడ్ ఉంటుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. రెగ్యుల‌ర్ యాటిట్యూడ్ కి భిన్నంగా స‌మంత భారీ స్టంట్స్.. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించాల్సి ఉంటుందిట‌. అందుకు త‌గ్గ‌ట్టు లుక్ మార్చ‌డ‌మే కాదు.. మార్ష‌ల్ ఆర్ట్స్ టెక్నిక్స్ తెలుసుకుంటోంద‌ని స‌మాచారం. వ‌చ్చే వారం నుంచి స‌మంత షూటింగ్ కు హాజ‌రు కానుంది. ఈ క‌మిట్ మెంట్ నేప‌థ్యంలో స‌మంత కొత్త సినిమాల‌కు అంగీక‌రించ‌లేదు. ఈ వెబ్ సిరీస్ లో మ‌నోజ్ బాజ్ పాయ్ మేల్ లీడ్ అన్న సంగ‌తి తెలిసిందే. ప్రియ‌మ‌ణి అత‌డి భార్య పాత్ర‌లో న‌టిస్తోంది. తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే ద్వ‌యం ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ -2 కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.