Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లు చేనేతకు ప్ర‌చారం ఏదీ?

By:  Tupaki Desk   |   4 Aug 2020 5:00 AM GMT
అక్కినేని కోడ‌లు చేనేతకు ప్ర‌చారం ఏదీ?
X
తెలంగాణ చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగారు అక్కినేని స‌మంత‌. నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడిన త‌ర్వాత కూడా విస్త్ర‌తంగా చేనేత వ‌స్త్రాల‌కు ప్ర‌చారం చేసారు. స‌మంత కృషిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా ఐటీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించి ధ‌న్య‌వాదాలు తెలిపారు. చేనేత ఫోటోషూట్లతో నిరంత‌రం స‌మంత యాక్టివ్ గా ఉండేవారు.

కానీ ఇటీవ‌ల ఏమైందో కానీ చేనేత(కాట‌న్) ప్ర‌చారం నిల్ అయిపోయింది. ఆ త‌ర‌హా వ‌స్త్ర‌ధార‌ణ త‌గ్గిపోయింది. సామ్ ఫోటోషూట్లు పూర్తి డిఫ‌రెంటుగా ఉంటున్నాయి. ఇక చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ కాంట్రాక్ట్ ఎంత‌కాలం అన్న‌ది కూడా అభిమానుల‌కు తెలీదు. సామ్ ఇటీవ‌ల అస్స‌లు చేనేత‌కు సంబంధించిన ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లోనూ క‌నిపించ‌డం లేదు. ఎలాంటి కాట‌న్ వ‌స్త్రాల్ని కూడా షేర్ చేయ‌లేదు.

ఇలాంటి స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి కాట‌న్ ధ‌రించి సోష‌ల్ మీడియాలో ఆ ఫోటోని షేర్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. పింక్ కాట‌న్ దుస్తుల్లో సామ్ క‌నిపిస్తున్నారు. అయితే ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్ ది కావ‌డం విశేషం. ``స్పృహతో సాధారణంగా క‌నిపించండి. మీరు అసాధారణంగా మారేంత సాధారణం`` అని ఆమె వ్యాఖ్యను జోడించారు. అంటే ఒక సెల‌బ్రిటీగా కాకుండా సాధార‌ణ యువ‌తిలా క‌నిపించాల‌నే ప్ర‌య‌త్న‌మేనా ఇది? మ‌జిలీ లో న‌టించాక సామ్ మైండ్ సెట్ లో కూడా మార్పొచ్చిందా?

ఇక సామ్ కెరీర్ సంగ‌తి చూస్తే.. ఫ్యామిలీ మ్యాన్ 2లో తీవ్ర‌వాది పాత్ర‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌నుంది. అక్టోబ‌ర్ లో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగుకు రానుంది. న‌య‌న‌తార‌తో క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తోంది. విజయ్ సేతుపతి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాకి `కాతువాకుల రేండు కాదల్‌` అనే టైటిల్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.