ఆదర్శంగా నిలుస్తున్న అక్కినేని వారి కోడలు..!

Thu Jun 10 2021 07:00:01 GMT+0530 (IST)

Samantha Akkineni Ideal

దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన అక్కినేని సమంత.. మోడలింగ్ చేస్తూ అనుకోకుండా సినీ రంగ ప్రవేశం చేసింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సామ్.. కెరీర్ ప్రారంభం నుంచే కథాబలమున్న సినిమాలు వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ప్రస్తుతం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది సమంత. రాజీ అనే తమిళ ఈలం సోల్జర్ గా అద్భుతంగా నటించిన సామ్.. అన్ని వర్గాల ప్రేక్షకులు నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది సమంత.

సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ల కెరీర్ ముగిసిపోయినట్లే అని అంటుంటారు. ఒకవేళ అవకాశాలు వచ్చినా క్యారక్టర్ ఆర్టిస్టుగా పరిమితం అవ్వాల్సి ఉంటుంది. కానీ సమంత మాత్రం అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తూ.. పెళ్లి అనేది కెరీర్ కు అడ్డంకి కాదని నిరూపించింది.

ఓవైపు పర్సనల్ లైఫ్ ని మరోవైపు సినీ కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న సమంత.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సినిమాలతో పాటుగా సామాజిక కార్యక్రమాలు - ఇతర వ్యాపారాలతో సామ్ ఇతర హీరోయిన్ల కంటే ప్రత్యేకంగా నిలిచింది. ఆమె 'సాకీ' అనే బ్రాండ్ పేరుతో గార్మెంట్ బిజినెస్ చేస్తోంది. 'సమంత అక్కినేని' లోని మొదటి పదాలను తీసుకొని దీనికి 'సాకీ' అనే పేరు పెట్టింది.

అలానే అణగారిన మహిళలు మరియు పిల్లలకు అండగా నిలవడానికి 'ప్రత్యూష ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తోంది సమంత. అంతేకాదు 'ఏకం' అనే స్కూల్ ని నడుపుతోంది. ఇకపోతే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న అక్కినేని వారి కోడలు.. రీసెంటుగా చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టైటిల్ సాధించింది. అలానే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్-2020 జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.