సమంత వెబ్ సిరీస్ ఎట్టకేలకు స్ట్రీమింగ్ కు సిద్దం

Tue May 04 2021 12:02:30 GMT+0530 (IST)

Samantha Action Peaks in Family Man 2

అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండవ సీజన్ లో సమంత కీలక పాత్రలో నటించిన కారణంగా సౌత్ ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ ను గత ఏడాది చివరి నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు ఫిబ్రవరిలో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు తేదీ కూడా ప్రకటించారు. కాని కొన్ని కారణాల వల్ల వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపి వేశారు. అప్పటి నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. కారణం పై క్లారిటీ రాలేదు కాని జూన్ మొదటి లేదా రెండవ వారంలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఒకటి రెండు రోజుల్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో పాకిస్థానీ ఉగ్రవాది పాత్రలో సమంత కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సమంత పుట్టిన రోజు సందర్బంగా దర్శకులతో ఆమె ఉన్న పొటోను విడుదల చేశారు. అందులో సమంత లుక్ చాలా మాసీగా సింపుల్ గా ఉంది. ఇన్నాళ్లు ఉగ్రవాది అంటూ వచ్చిన వార్తలు నిజమే అయ్యి ఉంటుందని ఆ ఫొటోను చూసిన తర్వాత అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2 ను స్ట్రీమింగ్ చేసిన తర్వాత దర్శకులు రాజ్ మరియు డీకే ల ద్వయం తెలుగులో ఒక వెబ్ సిరీస్ ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రముఖ యంగ్ హీరో తో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే వెబ్ సిరీస్ కు ప్రకటన వస్తుందని అంటున్నారు. అంది కూడా అమెజాన్ ప్రైమ్ లోనే ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి రాజ్ మరియు డీకేల దర్శకుల ద్వయం తెలుగు వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.