Begin typing your search above and press return to search.

అప్పుడెక్కడ ఉన్నారంటూ నాగ్ పై సామ్ ఫ్యాన్స్ ఫైర్..!

By:  Tupaki Desk   |   28 Jan 2022 11:30 PM GMT
అప్పుడెక్కడ ఉన్నారంటూ నాగ్ పై సామ్ ఫ్యాన్స్ ఫైర్..!
X
అక్కినేని నాగ చైతన్య - సమంత విడాకులు ప్రకటించి దాదాపు నాలుగు నెలలైంది. అయితే ఇప్పటికీ వీరిద్దరూ విడిపోవడం గురించి మీడియా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కారణాలు వెల్లడించనప్పటికీ.. దీనిపై సామ్ ఇప్పటికే స్పందించింది. 'బంగార్రాజు' మూవీ ప్రమోషన్స్ లో చైతూ కూడా విడాకుల గురించి మాట్లాడారు. అయితే అక్కినేని నాగార్జున కూడా దీనిపై బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించినట్లు.. విడాకులు కోరుకుంది సమంతనేనని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

నిన్నంతా హాట్ టాపిక్ గా మారిన ఈ వార్తలను నాగార్జున ట్విట్టర్ వేదికగా ఖండించారు. సమంత - నాగచైతన్య గురించి తాను చెప్పినట్లు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని పేర్కొన్నారు. దీంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. కానీ నాగ్ ట్వీట్‌ కి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. గతంలో ఈ వ్యవహారంలో సమంతదే తప్పు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ ఆమె అభిమానులు ట్వీట్స్ పెడుతున్నారు.

విడాకుల కోసం సమంత ఎక్కువ భరణం అడిగిందని.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని చైతూని మోసం చేసిందని వచ్చిన పుకార్లపై ట్రోల్స్ చేసినప్పుడు నాగార్జున ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. నాగచైతన్య సైతం సామ్ వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన రూమర్స్ ను ఖండించకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఆమె ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ మీద రూమర్స్ వస్తే మాత్రం నాగ్ వెంటనే స్పందించారని అంటున్నారు.

మరికొందరు మాత్రం చై సామ్ విడాకుల గురించి రూమర్స్ రావడానికి.. నాగార్జున స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పినట్లు మీడియాలో వార్తలు రావడానికి చాలా డిఫరెన్సె ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. స్టార్ కపుల్ విడాకుల ప్రకటన చేసినప్పుడే వాళ్లిద్దరూ విడిపోవడం బాధాకరమని అక్కినేని ఫ్యామిలీ తరపున నాగ్ స్పందించారని.. ఈ క్రమంలో సమంత తమ ఫ్యామిలీతో వున్న రోజులన్నీ తీపి గుర్తులని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అలానే సమంత బలమైన, స్వతంత్ర మహిళ అని.. ఆమెకు ఎవరి మద్దతు అవసరం లేదని అంటున్నారు. ట్రోల్స్ నుండి రక్షించుకోడానికి విడాకులు తీసుకున్న భర్త ఫ్యామిలీ అవసరమయ్యే బలహీనమైన స్త్రీ కాదని అభిప్రాయ పడుతున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి సామ్ కు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా విడాకులు అనేవి భార్యాభర్తల వ్యక్తిగతం, అంతర్గత వ్యవహారం. చై సామ్ మధ్య ఏం జరిగిందో.. అలాంటి కఠిన నిర్ణయం తీసుకోడానికి కారణమేమిటో వారి ఇరువురి కుటుంబాలకు మాత్రమే తెలుస్తుంది