పుష్ప ఐటెమ్ సాంగ్ పాడిన సల్మాన్.. సమంత లవ్లీ రియాక్షన్

Mon Jun 27 2022 16:00:01 GMT+0530 (IST)

Salman sings Pushpa item song .. Samantha Lovely Reaction

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఏదో ఒక విషయం తో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ సినిమా గురించి సినీ తారలు కూడా ఏదో ఒక విధంగా స్పందిస్తూ ఉండడం విశేషం. నార్త్ జనాలకు ఇప్పటికే పుష్ప సినిమా చాలా బాగా ఎక్కేసింది.అల్లు అర్జున్ మ్యానరిజం అలాగే సినిమాలోని పాటలు డైలాగ్స్ ఇలా అన్ని రకాలుగా సోషల్ మీడియా లో ఏదో ఒక బ్యాక్ అయితే క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ బజ్ అయితే పుష్ప సెకండ్ పార్ట్ వచ్చే వరకు ఉంటుంది అని అనిపిస్తోంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా పుష్ప ఐటమ్ సాంగ్ పై స్పందించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఐఫా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ అక్కడ ఇష్టమైన పాట గురించి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎక్కువగా ఊ అంటావా మామ అనే పాట చాలా బాగా నచ్చేసింది వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సల్మాన్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉండడంతో ఆ వీడియో పై సమంతా కూడా రియాక్షన్ ఇచ్చింది. లిటిల్ రెడ్ హార్ట్స్ తో అందుకు సంబంధించిన ట్వీట్ను రీట్వీట్ చేయడం విశేషం. ఏదేమైనా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సంచలనం సృష్టించింది అని చెప్పాలి.

కేవలం హిందీ లో నే ఈ సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సెకండ్ పార్ట్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు మరింత కష్టపడాలి అని డిసైడ్ అయ్యారు. మొదట అనుకున్న ప్లాన్ కూడా మార్చేస్తూ అంతకుమించి తెరపైకి తీసుకురావాలని చర్చలు జరుపుతున్నారు. సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని షూటింగ్ పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది.

అయితే ఇప్పట్లో ఆ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని కూడా మరో కొత్త టాక్ వినిపిస్తోంది. సుకుమార్ మళ్ళీ కొత్త ప్లాన్ రెడీ చేసుకునే లోపు అల్లు అర్జున్ మరో మీడియం రేంజ్ ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.