కత్రినాకి బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చిన సల్లూ భాయ్...!

Thu Jul 16 2020 23:00:01 GMT+0530 (IST)

Salman khan gives birthday surprise to Katrina ...!

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ హిట్ ఫెయిర్ గా పిలవబడుతుంటారు. ఇప్పటి వరకు ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై 'మైనే ప్యార్ క్యూ కియా' 'యువరాజ్' 'ఏక్ థా టైగర్' 'టైగర్ జిందా హై' 'భారత్' లతో పాటు పలు సినిమాల్లో ఇద్దరూ కలిసి స్పెషల్ రోల్స్ చేసారు. ఇక ఆఫ్ స్క్రీన్ లో కూడా సల్మాన్ - కత్రినా జంట గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి కత్రినా కైఫ్ కాస్తా కత్రినా ఖాన్ అయ్యుండేదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఎవరికి వారే అన్నట్లు ఉంటున్న సల్మాన్ - కత్రినాలు చివరగా 'భారత్' సినిమాలో కలిసి నటించారు.కాగా బుధవారం కత్రినా కైఫ్ పుట్టినరోజు. 37వ ఏట అడుగుపెడుతున్న కత్రినాకి సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెప్తూ వచ్చారు. ఈ క్రమంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'టైగర్ జిందా హై' మూవీ సమయంలో తీసుకున్న ఈ ఫోటోను పోస్ట్ చేసిన సల్లూ భాయ్ 'హ్యాపీ బర్త్ డే కత్రినా' అని ట్వీట్ చేసారు. నిజానికి సల్మాన్ సోషల్ మీడియాలో పెద్దగా ఎవరికీ బర్త్ డే విషెస్ చెప్పడు. కానీ కత్రినా పుట్టిన రోజుకి మాత్రం స్పెషల్ గా విష్ చేసి కత్రినాకి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక కత్రినా కైఫ్ లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ గా పిలవబడుతున్న విక్కీ కౌశల్ కూడా కత్రినాకి బర్త్ డే విషెష్ చెప్పారు.