Begin typing your search above and press return to search.

ఇండియన్‌ స్టార్స్‌ లో సల్మాన్‌ ఒకే ఒక్కడు చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   12 July 2020 7:10 AM GMT
ఇండియన్‌ స్టార్స్‌ లో సల్మాన్‌ ఒకే ఒక్కడు చేస్తున్నాడు
X
కరోనా కారణంగా సినిమా షూటింగ్స్‌ అన్ని కూడా ఆగిపోయాయి. అన్‌ లాకింగ్‌ లో భాగంగా షూటింగ్స్‌ కు అనుమతులు వచ్చినా కూడా స్టార్‌ హీరోలు ఎవరు కూడా షూటింగ్స్‌ కు వెళ్లడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కండీషన్స్‌ మద్య షూటింగ్‌ ను చేయడం ఇబ్బంది అనే ఉద్దేశ్యంతో చిన్న సినిమాలు మినహా పెద్ద సినిమాలు ఇప్పటి వరకు షూటింగ్‌ కు వెళ్లలేదు. అయితే సల్మాన్‌ మాత్రం తాజాగా షూటింగ్‌ మొదలు పెట్టాడు.

ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో కేవలం సల్మాన్‌ ఖాన్‌ మాత్రమే ప్రస్తుతం షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ‘రాధే’ చిత్రంను సల్మాన్‌ ఖాన్‌ ముగించే పనిలో ఉన్నాడు. కరోనా లేకుండా ఉంటే విదేశాల్లో షెడ్యూల్‌ అనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల షెడ్యూల్‌ అనేది అసాధ్యంగా మారింది. అందుకే సల్మాన్‌ ఖాన్‌ ముంబయిలోని ఒక ప్రముఖ స్టూడియోలో ‘రాధే’ మొత్తం షూటింగ్‌ ను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. రాధే సినిమా షూటింగ్‌ పూర్తి అయితే మరో ప్రాజెక్ట్‌ మొదలు పెట్టవచ్చు అనే ఉద్దేశ్యంతో ఉన్న సల్మాన్‌ స్టూడియోలో చిత్రీకరణ చేస్తున్నారట.

సామాజిక దూరం పాటించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ చేస్తున్నారు. బ్లూ మ్యాట్‌.. గ్రీన్‌ మ్యాట్‌ పై చిత్రీకరణ జరిపి గ్రాపిక్స్‌ లో లొకేషన్స్‌ చేంజ్‌ చేయబోతున్నారట. సల్మాన్‌ ఖాన్‌ మరో రెండు వారాల్లో రాధే చిత్రంను పూర్తి చేయబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎన్నో ప్రాజెక్ట్‌ లు ఒప్పందం చేసుకున్న కారణంగానే రాధే సినిమాను హడావుడిగా సల్మాన్‌ పూర్తి చేస్తున్నాడట. కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో షూటింగ్‌ అంటే చాలా పెద్ద సాహసమే. ఆ సాహసంను కేవలం సల్మాన్‌ మాత్రమే చేస్తున్నాడు.