Begin typing your search above and press return to search.

తాగి కుర్ర‌హీరో చెంప చెల్లుమ‌నిపించిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   20 May 2020 5:00 AM GMT
తాగి కుర్ర‌హీరో చెంప చెల్లుమ‌నిపించిన స్టార్ హీరో
X
తాగిన మ‌త్తులో ఉన్న‌ప్పుడు సిత్ర‌విచిత్రాలు చూడాల్సి ఉంటుంది. అలానే ఓ స్టార్ హీరో ప‌బ్బు పార్టీలో త‌న‌తో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న కుర్ర‌హీరో చెంప చెల్లుమ‌నిపించాడ‌ట‌. అయితే ఈ విష‌యంపై ఘ‌ట‌న జ‌రిగిపోయిన చాలా కాలానికి సోషల్ మీడియాలో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగింది. అది కూడా నిన్న‌గాక మొన్న జ‌రిగిన ఘ‌ట‌న అంటూ ప్ర‌చారం సాగ‌డంతో స‌ద‌రు కుర్ర‌హీరో అభిమానులు దానిపై ఆరాలు తీశారు. అస‌లింత‌కీ ఈ గొడ‌వ ఎవ‌రి మ‌ధ్య‌? అంటే.. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ .. చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఇది. అస‌లింత‌కీ ఏమైంది? అంటే..

కొన్ని వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌‌తో మాంచి స్పీడ్ మీదున్న స‌ల్మాన్ భాయ్ అప్ప‌ట్లో ఓ ప‌బ్బులో పార్టీ మూడ్ లో ఉన్నాడు. ఫుల్లుగా పెగ్గు పుచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలో ఓ కుర్రాడు అక్క‌డికి త‌న ఫ్రెండ్స్ గ్యాంగ్ తో దూసుకొచ్చాడు. అంతేకాదు.. అక్క‌డికి రావ‌డ‌మే స‌ల్మాన్ ఖాన్ తో ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. చిన్న గొడవ చినికి చినికి గాలివానైంది. ఆ క్ర‌మంలోనే కోపంతో ఊగిపోయిన స‌ల్మాన్ ర‌ణ‌బీర్ క‌పూర్ చొక్కా ప‌ట్టుకుని చెంప చెల్లుమ‌నిపించాడ‌ట‌. ఫ్రెండ్స్ ముందే అవ‌మాన భారంతో కుంగిపోయిన‌ ర‌ణ‌బీర్ ఆ త‌ర్వాత రుస‌రుసా అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

అయితే స‌ల్మాన్ ఇలా ర‌ణ‌బీర్ చెంప ప‌గ‌ల‌గొట్ట‌డానికి కార‌ణం ప్రియురాలు క‌త్రిన కైఫ్ అంటూ ప్ర‌చార‌మైపోయింది. కానీ వాస్త‌వం అది కానేకాద‌ట‌. ర‌ణ‌బీర్ స్టార్ హీరో అయ్యి క‌త్రిన‌తో ల‌వ్ లో ఉన్న‌ప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగితే ఈర్ష్య‌తో భాయ్ అలా చేశాడ‌ని అనుకోవ‌చ్చు కానీ.. అస‌లు ఆ ఘ‌ట‌న జ‌రిగింది ర‌ణ‌బీర్ హీరో కాక‌ముందరే. అప్ప‌టికి కాలేజ్ బోయ్ గా అల్ల‌రి వేషాలు వేసే ర‌ణ‌బీర్ ప‌బ్బుల్లో నానా ర‌చ్చ చేసేవాడ‌ట‌. అయినా ఆ ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం ర‌ణ‌బీర్ - రిషీ క‌పూర్ (తండ్రి కొడుకులు)ల‌కు స‌ల్మాన్ తండ్రి గారైన స‌లీమ్ ఖాన్ సారీ చెప్పార‌ట‌.

అయినా చెంప దెబ్బ అంత తేలిగ్గా మ‌ర్చిపోయేది కానే కాదు. స‌ల్మాన్ గాళ్ ఫ్రెండ్ క‌త్రిన‌నే ల‌వ్ లో ప‌డేసి బాప్ రే అనిపించాడు ర‌ణ‌బీర్. చెంప దెబ్బ‌కు స‌రైన గుణ‌పాఠ‌మే అయ్యింది. అయితే స‌ల్మాన్ ని కాద‌ని ర‌ణ‌బీర్ ని ప్రేమించిన క‌త్రిన‌కు ఎలాంటి చెప్పు దెబ్బ త‌గిలిందో తెలిసిందే క‌దా!