సల్మాన్ ఖాన్ భార్య బిడ్డను ఎక్కడ దాచాడు?

Wed Jul 21 2021 23:00:02 GMT+0530 (IST)

Salman Khan clarified about that romours

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అయిదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కాని ఆయన ఎంతో మందితో ప్రేమ వ్యవహారాలు నడిపాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.. ఇప్పుడు కూడా ఒక ఇంగ్లీష్ బ్యూటీతో ఈయన ప్రేమలో ఉన్నాడు అనేది పుకారు.ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కాని ఆయన మాత్రం పెళ్లి విషయంలో ఇంకా కూడా అస్పష్టంగానే సమాధానాలు చెబుతూ వస్తున్నాడు. ఎప్పటికి పెళ్లి చేసుకోడేమో అంటూ అభిమానులు ఒక నమ్మకంకు వచ్చేశారు.

కొన్నాళ్ల క్రితం సల్మాన్ ఖాన్ కు పెళ్లి అయ్యిందని.. ఆయన తన భార్య మరియు బిడ్డను వేరే దేశంలో దాచారు అంటూ నెటిజన్ ఒకరు కామెంట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ చాలా పెద్ద చర్చ జరిగింది. సల్మాన్ నిజంగానే పెళ్లి చేసుకుని భార్య బిడ్డను దుబాయ్ లో ఉంచాడా అంటూ కొందరు ప్రశ్నించడం మొదలు పెట్టారు.

సల్మాన్ భార్య పేరు నూర్ మరియు ఆయనకు 17 ఏళ్ల కూతురు కూడా ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయమై స్పందిస్తూ సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. తన తమ్ముడు హర్బజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పించ్ టాక్ షో సీజన్ 2 లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ తన గురించి మీడియాలో వచ్చిన వార్తలను కొట్టి పారేశాడు.

టాక్ షో లో అర్బజ్ ఖాన్ అన్న సల్మాన్ ఖాన్ ను ప్రశ్నిస్తూ.. మీరు పెళ్లి చేసుకున్న భార్య ను మరియు మీ 17 ఏళ్ల పాపను ఎక్కడ దాచారు అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఆశ్చర్య పోతూ ఈ ప్రశ్నను నన్నే అడుగుతున్నావా. లేదా మరెవ్వరి ప్రశ్న అయినా నన్ను అడుగుతున్నావా అంటూ గట్టిగా నవ్వేశాడు.

మీడియాలో వచ్చిన వార్తలకు మీ సమాధానం కావాలనే ఈ ప్రశ్న అడుగుతున్నట్లుగా అర్బజ్ ఖాన్ చెప్పడంతో సల్మాన్ ఖాన్ అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. నా చినప్పటి నుండి నేను ముంబయిలోనే ఉన్నాను అంటూ స్పష్టంగా చెప్పుకొచ్చాడు.