Begin typing your search above and press return to search.

భాయ్ ఏమిటిలా.. ప‌దెక‌రాల రైతుకైనా రాకూడ‌ని క‌ష్టం!

By:  Tupaki Desk   |   14 July 2020 4:31 PM GMT
భాయ్ ఏమిటిలా.. ప‌దెక‌రాల రైతుకైనా రాకూడ‌ని క‌ష్టం!
X
ప‌దెక‌రాల రైతుకైనా ఇంత క‌ష్టం రాకూడ‌దు.. పాపం స‌ల్మాన్ భాయ్ ని చూస్తే ఏమిటో ఈ క‌ష్టం అనిపించ‌డం లేదూ? ముంబై ఔట్ స్క‌ర్ట్స్ లోని ప‌న్వేల్ ఫామ్ హౌస్ లో ఎంత‌గా శ్ర‌మిస్తున్నాడో.. ఓవైపు పొలం పండిస్తూ.. తోట‌కు నీళ్లు మ‌ళ్లిస్తూ భాయ్ క‌ష్టం అంతా ఇంతా కాదు.

జిమ్ లో డంబెల్స్ ఎత్తి అద్దాల్లో చూసుకున్నంత ఈజీగా లేనట్టుంది ఈ ప‌ని. ఒక నికార్స‌యిన రైత‌న్న‌లా పొలం ప‌ని చేసి జీవించాలంటే ఎంత క‌ష్ట‌మో అర్థ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. ప‌దెక‌రాలు పండించేందుకు రైత‌న్న ఎంత‌గా శ్ర‌మించాల్సి ఉంటుందో ప్రాక్టిక‌ల్ గానే తెలిసిన‌ట్టు ఉంది ఇక్క‌డ భాయ్ ఫోటో చూస్తుంటే..

మ‌హ‌మ్మారీ కారణంగా ముంబైలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సల్మాన్ ఖాన్ సిటీ ఔట‌ర్ లోని పన్వెల్ ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారు. తన బసలో ప్రకృతి జీవ‌నానికి అల‌వాటు ప‌డ్డాడు. ఆ ప‌నినే అదే ప‌నిగా ఆస్వాధిస్తున్నాడు. ఆరంభం కొన్నిరోజుల పాటు గాళ్ ఫ్రెండ్స్ తో ఫామ్ హౌస్ లో ఫుల్ జాలీగా గ‌డిపేసిన భాయ్ ఆ త‌ర్వాత అస‌లైన ప‌నిలోకి దిగాడు. పొలం ప‌నిపై మ‌క్కువ పెంచుకున్నాడు. బాగా నీరు చేరిన పొలంలో ద‌మ్ము ప‌ట్టిన బుర‌ద‌లో దిగి వ‌రి నాట్లు కూడా వేశాడు భాయ్. ఇదిగో ఇలా స్వేదం చిందిస్తూ బురుద పులుముకుని రోజంతా ప‌ని చేశాడ‌ట పాపం.

తన పొలంలో ఒక క‌ఠోర‌మైన రోజు అలా గ‌డిచిపోయింది. ఆ సంగ‌తిని వెల్ల‌డిస్తూ ఇదిగో ఇలా ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ``రైతులందరికీ గౌరవం ఇవ్వండి ..`` అనే క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోని రైతులందరికీ అంకితమిచ్చాడు. బాప్ రే.. భాయ్ నా మ‌జాకానా?