బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు మృతి - బోరున విలపించిన సల్మాన్

Tue Mar 31 2020 10:20:01 GMT+0530 (IST)

Salman Khan Nephew Passes Away

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ లంగ్ కాన్సర్ కారణంగా హఠాన్మరణం చెందారు. అబ్దుల్లా వయసు 38 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ధృవీకరించిన సల్మాన్ 'ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము' అంటూ తన ట్విటర్ ఖాతాతో విషయాన్ని అభిమానులకు చేరవేశారు. అబ్దుల్లా మరణ వార్తను విని ఆయన బోరున విలపించారు.కాగా అబ్దుల్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్ అయిన అబ్దుల్లా సల్మాన్ తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిత్యం జిమ్ కు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్లు డైసీ షా మరియు జరీన్ ఖాన్ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.