డెవిల్ తో పెట్టుకుంటే మనోడికి చిక్కులే

Thu Sep 19 2019 13:18:49 GMT+0530 (IST)

Salman Khan Miffed with Ranbir Kapoor Tentative Film Title Devil

`అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్` తో సందీప్ రెడ్డి వంగా సంచలన విజయం అందుకున్నారు. ఉత్తరాదినా అతడి పేరు మార్మోగుతోంది. ఆ క్రమంలోనే సందీప్ కి కబీర్ సింగ్ నిర్మాతలు మరో క్రేజీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ కథానాయకుడిగా ప్రస్తుతం ఓ భారీ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు సందీప్. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాకి టైటిల్ సెలక్షన్ లో ఓ చిక్కు వచ్చి పడిందట. ఇప్పటికే ఈ చిత్రానికి `డెవిల్` అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ అది ఫైనల్ చేయాలంటే ఊహించని విధంగా ఓ చిక్కు ఎదురవుతోంది.బాలీవుడ్ కండల హీరో సల్మాన్ భాయ్ తో చిన్నపాటి కిరికిరి ఎదురవుతోందట. ఇంతకీ ఏమిటి ఆ కిరికిరి అంటే.. సల్మాన్ నటించిన `కిక్ `లో దేవి లాల్ సింగ్ అనే పాత్రలో నటించారు. ఆ పాత్రను షార్ట్ కట్ లో డెవిల్ అని అభిమానులు పిలుచుకున్నారు. కిక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో డెవిల్ తో భాయ్ సెంటిమెంటల్ గా అటాచ్ అయిపోయాడు. పైగా జనాల మైండ్ లోనూ డెవిల్ అంటే సల్మాన్ అని రిజిస్టర్ అయిపోయింది. ఇలాంటప్పుడు ఆ టైటిల్ ని ఎంచుకోవడం సరైనదేనా? అని ఆలోచిస్తున్నారట.

ప్రస్తుతం సల్మాన్ కథానాయకుడిగా కిక్ 2  సెట్స్ పై ఉంది. దీనిని `డెవిల్ ఈజ్ కంబ్యాక్` అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేయనున్నారు. ఇలాంటి సన్నివేశంలో డెవిల్ అనే టైటిల్ ని నిర్ణయిస్తే అది కాస్తా ఇబ్బందికరం అని సందీప్ వంగ అండ్ టీమ్ భావిస్తున్నారట. సల్మాన్ భాయ్ క్రెడిట్ ని తమ టీమ్ లాక్కోవడం సరికాదని భావించి వేరొక టైటిల్ ని వెతుకుతున్నారట. అర్జున్ రెడ్డి- కబీర్ సింగ్ జోనర్ లోనే రఫ్ అండ్ రగ్గ్ డ్ క్యారెక్టరైజేషన్ ని ఎంచుకున్నాడు కాబట్టే డెవిల్ లాంటి టైటిల్ అయితే బావుంటుందని భావించారు. కానీ సమస్య తలెత్తింది. అసలే రణబీర్ అంటే అంతెత్తున విరుచుకుపడే సల్మాన్ భాయ్.. ఈ టైటిల్ గురించి వింటే భగ్గుమనడం ఖాయం. ఆ కోణంలోనూ ఆలోచిస్తున్నారనే భావించాలి.