Begin typing your search above and press return to search.

రిలీజ్ కానీ సినిమా పై సల్మాన్ ఖాన్ దృష్టి..??

By:  Tupaki Desk   |   17 Jun 2021 12:30 PM GMT
రిలీజ్ కానీ సినిమా పై సల్మాన్ ఖాన్ దృష్టి..??
X
సౌత్ సినిమాలు రిలీజ్ అవ్వడమే ఆలస్యం బాలీవుడ్ మేకర్స్ వెంటనే రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇదివరకు ప్రొడ్యూసర్స్ పరభాషా సినిమాల రీమేక్ హక్కులు దక్కించుకునేందుకు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. నేరుగా హీరోలే రీమేక్ రైట్స్ కోసం ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ మేకర్స్ యాక్టర్స్ దక్షిణాది సినిమాల రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటారు. సరే సినిమాలు రిలీజై సూపర్ హిట్ అయిన తర్వాత రీమేక్ రైట్స్ దక్కించుకోవడం అంటే ఓకే. ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి చేయొచ్చు అనిపిస్తుంది.

కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండా సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ డేట్ అనౌన్స్ చేయకముందే రీమేక్ రైట్స్ దక్కించుకుంటే సిట్యుయేషన్ ఏంటి..? ఒకవేళ ఒరిజినల్ సినిమా ఫలితం తారుమారు అయితే మాత్రం పెద్దబొక్కే అవుతుంది. ఎందుకంటే అప్పటివరకు రీమేక్ చేయనున్నట్లు వార్తల్లో నిలిచిన సినిమా ఒక్కసారిగా వార్తల్లో లేకుండా పోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి పనే చేస్తున్నాడని టాక్. టాలీవుడ్ సినిమా రిలీజ్ కాకముందే దాని రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు పిలుపునిచ్చాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఆల్రెడీ తన కెరీర్ లో రీమేక్ సినిమాలు చాలానే చేసాడు. కానీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సినిమా రీమేక్ అనేసరికి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అదికూడా మాస్ రాజా నటిస్తున్న 'ఖిలాడి' సినిమా కావడం విశేషం. ఇదివరకు సల్మాన్ రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ 'కిక్' సినిమా రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఖిలాడి సినిమా లైన్ పెడుతున్నాడంటే.. అదికూడా షూటింగ్ స్టేజిలో ఉన్నటువంటి సినిమా పై కన్నేసాడు. మరి ఆల్రెడీ దానికి సంబంధించి కథ-కథనాలు ఆ రేంజిలో ఉన్నాయేమో అని చెప్పవచ్చు. మరి ఈ ఏడాది రాధే సినిమాతో ప్లాప్ అందుకున్నాడు.. ప్రస్తుతం కబీ ఈద్ కబీ దీవాలి అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మాస్ రాజా రీమేక్ సినిమా ప్రకటిస్తాడా చూడాలి.