చుల్ బుల్ పాండే ఫిక్స్ అయ్యాడు

Wed Sep 11 2019 13:26:47 GMT+0530 (IST)

Salman Khan Dabangg 3 Official Motion Poster

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిన గబ్బర్ సింగ్ ఒరిజినల్ వెర్షన్ సల్మాన్ ఖాన్ చేసిన దబాంగ్ అన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రెండో భాగం వచ్చి అది కూడా సూపర్ హిట్ అయ్యింది. కాకపోతే పవన్ వేరే కథతో సర్దార్ గబ్బర్ సింగ్ తీస్తే అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు దబాంగ్ మూడో సిరీస్ రెడీ అవుతోంది. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న దబాంగ్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.డిసెంబర్ 20ని లాక్ చేసుకుంటూ ఇందాక ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మొదటి రెండు భాగాల్లో చుల్ బుల్ పాండేకు జోడిగా నటించిన సోనాక్షి సిన్హానే ఇందులోనూ హీరోయిన్ గా నటిస్తోంది. అర్బాజ్ ఖాన్ నిర్మాతగానూ తమ్ముడిగానూ రెండు బాధ్యతలు తీసుకున్నాడు

ఇప్పటికే దబాంగ్ 3 మీద బాలీవుడ్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కన్నడ స్టార్ సుదీప్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ తర్వాత సల్మాన్ - ప్రభుదేవాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. ఇన్నిరకాలుగా దీని మీద హైప్ మాములుగా లేదు. నిజానికి వచ్చే ఏడాది ఉండొచ్చన్న అంచనాలు తలకిందులు చేస్తూ దబాంగ్ 3 రిలీజ్ డేట్ ని ప్రకటించడం ఆశ్చర్యమే.

ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇతర సినిమాల నిర్మాతలు తమ తేదీలను ప్లాన్ చేసుకునే పడ్డారు. ఒకవేళ దబాంగ్ 3 కనక హిట్ అయితే తెలుగులో ఎవరు చేస్తారు అనే అనుమానం అక్కర్లేదు. దీన్ని తెలుగు తమిళ్ లో డబ్బింగ్ రూపంలో విడుదల చేసేందుకు నిర్ణయించుకుంది సల్మాన్ టీమ్. సో నో ఛాన్స్.