అన్నింటికి ఆయనే ఇన్సిపిరేషన్

Thu Nov 25 2021 16:00:25 GMT+0530 (IST)

Salman Inspiration to Tovino Thomas?

సల్మాన్ ఖాన్ పేరు చెప్పగానే అభిమానులకు ఆయన కండలే గుర్తుకు వస్తాయనడంలో సందేహం లేదు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటూ అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. సల్మాన్ ఖాన్ అభిమానులు మరియు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది కూడా ఆయన ఫిజిక్ ను అభిమానిస్తూ ఉంటారు.తాజాగా మలయాళ హీరో టోవినో థామస్ స్పందిస్తూ సల్మాన్ అంటే తనకు ఉన్న ఇష్టంను చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ ఫిజిక్ అంటే నాకు ఎంతో ఇష్టం. సల్మాన్ ఖాన్ కండలను చూసిన తర్వాతే నాకు కండలు పెంచాలని ఆశ కలిగిందని టోవినో చెప్పుకొచ్చాడు. ఈమద్య కాలంలో టోవినో థామస్ తన కండలను తెగ చూపిస్తున్నాడు అందుకు ఆదర్శం సల్మాన్ అని తాజాగా చెప్పుకొచ్చాడు.

ఎన్నో ఏళ్లుగా సల్మాన్ ఖాన్ ను అభిమానిస్తూ ఉన్న టోవినో కు తాజాగా ఆయన్ను కలిసే అవకాశం దక్కింది. ఒక అభిమాన హీరోను కలిసిన సమయంలో ఏ అభిమాని అయినా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఇప్పుడు అదే పరిస్థితిలో టోవినో ఉన్నాడు.

ఆయన చాలా సంతోషంగా సల్మాన్ ను కలిసిన ఫొటోను షేర్ చేసి అందరితో తన ఆనందంను పంచుకున్నాడు. తాను ఎన్నో సంవత్సరాలుగా సల్మాన్ ను అభిమానిస్తున్న తీరు మరియు ఆయన వ్యవహార శైలిని గురించి చెప్పుకొచ్చాడు.

జీవితంలో ఒక్క సారి అయినా సల్మాన్ ఖాన్ ను కలవాలని ఆశ పడ్డాను. అనుకున్నట్లుగానే సల్మాన్ ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ టోవినో చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఇన్ఫిపిరేషన్ గా కండలు ఎలా అయితే పెంచానో అలాగే ఆయన పద్దతులు కూడా అలవాటు చేసుకున్నట్లుగా చెప్పుకున్నాడు.

సల్మాన్ ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా కనిపిస్తాడు. ప్రతి ఒక్కరితో కూడా చాలా నార్మల్ గా ఉంటాడు. తాను కూడా అలాగే ఉండాలని అనుకుంటాను.. నాకు అన్ని విషయాల్లో సల్మాన్ ఖాన్ ఇన్సిపిరేషన్ అంటూ టోవినో చెప్పుకొచ్చాడు.